Sreemukhi : ఇలా మారిపోయిందేంటి?.. శ్రీముఖిని చూసి అవాక్కవుతున్న అభిమానులు
Sreemukhi : శ్రీముఖికి నెట్టింట్లో మంచి పాపులారిటీ ఉంది. బుల్లితెరపై మంచి ఊపులో ఉన్న సమయంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. పటాస్ షో నెంబర్ వన్‌గా దూసుకుపోతోన్నప్పుడు, టాప్ యాంకర్‌గా శ్రీముఖి క్రేజ్ ఉన్నప్పుడే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది. బిగ్ బాస్ షో వల్ల శ్రీముఖికి ఒరిగిందేమీ లేదు. చివరకు నెగెటివిటీ మూటగట్టుకుంది.
రాహుల్ సిప్లిగంజ్‌తో గొడవల మూలంగా చివరకు రన్నర్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత స్టార్ మాలో పలు ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు జీ తెలుగు, ఈటీవీ అంటూ తిరుగుతోంది. సరిగమప షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఇప్పుడు జాతి రత్నాలు అనే కొత్త షోను కూడా ఈటీవీ ప్లస్‌లో ప్రారంభిస్తోంది.
Sreemukhi : జీరో సైజులోకి మారిన శ్రీముఖి..
అయితే శ్రీముఖిలో చాలా మార్పులు వచ్చాయి. తన ఫిట్ నెస్ మీద శ్రీముఖి ఫోకస్ పెట్టేసింది. తన భారీ కాయం మీద షోలు, ఈవెంట్లలో ఎన్నో సెటైర్లు వేసేవారు. లావుగా ఉందంటూ కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు శ్రీముఖి అందరికీ తానెంటో చూపించింది. జీరో సైజులోకి మారిపోయి కనిపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతలా ఎలా మారిపోయావ్ అని కామెంట్లు పెడుతున్నారు.