Home » Entertainment » Sreemukhi Oo Antava Dance With Sekhar Master
Entertainment

Sreemukhi : వామ్మో ఇదేం ఊపడం సామీ.. శేఖర్ మాస్టర్‌తో కలిసి శ్రీముఖి రచ్చ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 7, 2022, 4:30 pm
Advertisement

Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె వేసే పంచులు, నవ్వులు, కౌంటర్లు అందరికీ తెలిసిందే. ఇక ఆమె స్టెప్పులు వేస్తే జనాలు ఊగిపోవాల్సిందే. ఆమె బారీ అందాలను షేక్ చేస్తూ వేసే స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. స్టేజ్ మీద స్టెప్పులు వేసినా, ఇంట్లో డ్యాన్స్ చేసినా, కేరవ్యాన్‌లో రిహార్సల్స్ చేసినా, రీల్ వీడియోల కోసం డ్యాన్స్ చేసినా కూడా అదిరిపోతుంది. ఇక స్టేజ్ మీద శ్రీముఖి వేసే స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు బుల్లితెరపై శ్రీముఖి ఫుల్ బిజీగా ఉంటోంది. ఈటీవీలో జాతి రత్నాలు షోతో బిజీగా ఉంది. స్టార్ మాలో ఈవెంట్లు చేస్తోంది. మొన్నటి వరకు జీ తెలుగులో సరిగమప షోకు హోస్టింగ్ చేసింది.

Advertisement

ఇక ఇప్పుడు ఓటీటీ డ్యాన్స్ షోలోకి వచ్చింది. ఆహా కోసం ఓంకార్ డ్యాన్స్ ఐకాన్ అనే డ్యాన్స్ షోను స్టార్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఓంకార్ తన డ్యాన్స్ ప్లస్ టీంను పట్టుకొచ్చుకున్నాడు. యశ్ మాస్టర్, మోనాల్ ఇలా అందరినీ తెచ్చుకున్నాడు. శేఖర్ మాస్టర్‌ని కూడా ఓంకార్ తన వెంటనే తెచ్చుకున్నాడు. ఈ షోలో యశ్ మాస్టర్, మోనాల్, శ్రీముఖిలు మెంటర్లుగా ఉంటారట. ఇక శ్రీముఖి మీద తాజాగా ఓ ప్రోమో వదిలారు. సమంత చేసిన ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటకు శ్రీముఖి స్టేజ్ మీద స్టెప్పులు వేసింది. సమంత రేంజ్లోనే శ్రీముఖి కూడా ఊపేసింది.

Sreemukhi oo antava dance with sekhar master

Advertisement

తన భారీ అందాలు కనిపించేలా శ్రీముఖి మూమెంట్స్ వేసింది. ఇక శ్రీముఖి మాత్రమే కాకుండా స్టేజ్ మీదకు శేఖర్ మాస్టర్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి ఊపు ఊపేశారు. అసలు వీరిద్దరి కాంబినేషన్‌కు, స్టెప్పులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంంది. ఇలా ఈ ఇద్దరూ ఊ అంటావా మామ అనే పాటకు స్టెప్పులు వేయడంతో ప్రోమో అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ ఓ సారి ఇలానే కేరవ్యాన్‌లో ఈ ఇద్దరూ ఊపు ఊపేశారు. అప్పట్లో ఆ రీల్ వీడియో నానా కాంట్రవర్సీకి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా స్టేజ్ మీదనే ఇద్దరూ కుమ్మేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి