Sreemukhi Ra Ra Rakkamma Reel in Caravan
Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అయితే శ్రీముఖి ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్నింట్లోనూ సందడి చేస్తోంది. ఇక ఇప్పుడు ఓటీటీ షోల్లోనూ కనిపించబోతోంది. ఆహాలో ఓంకార్ ఓ డ్యాన్స్ షోను చేయబోతోన్నాడు. డ్యాన్స్ ఐకాన్ అంటూ వచ్చే నెలలో ఆ షోను ప్రారంభించబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ షోకు సంబంధించిన వివరాలను ప్రకటించేశాడు. ఈ షోకు జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్ రాబోతోన్నాడు. ఆయనతో పాటు మరో లేడీ జడ్జ్ కూడా ఉండబోతోంది. ఇక మోనాల్ గజ్జర్, యశ్ మాస్టర్ వంటి వారు మెంటర్లుగా రాబోతోన్నారు. వీరితో పాటుగా శ్రీముఖి కూడా ఉండబోతోంది. డ్యాన్స్ ప్లస్ టీంనే ఓంకార్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసినట్టు కనిపిస్తోంది.
అయితే ఈ ప్రోమోలో శ్రీముఖి తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంది. రా రా రక్కమ్మ అంటూ శ్రీముఖి స్టేజ్ మీద తన అందాలను షేక్ చేసింది. అయితే దీని కంటే ముందే.. కేరవ్యాన్‌లోనూ శ్రీముఖి ఈ స్టెప్పులు ప్రాక్టీస్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ వీడియోను రీల్‌గా మలిచినట్టుంది. అసలే శ్రీముఖి రీల్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. శ్రీముఖి వేసే స్టెప్పులు, ఆ మధ్య కేరవ్యాన్‌లో శేఖర్ మాస్టర్‌తో కలిసి శ్రీముఖి వేసిన చిందులు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. శ్రీముఖి స్టేజ్ మీద అయినా, ఇలా నెట్టింట్లో అయినా కూడా తన మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. మామూలుగానే శ్రీముఖి డ్యాన్సులకు ఫేమస్.
Sreemukhi Ra Ra Rakkamma Reel in Caravan
ఆ విషయం ఇది వరకే ఎన్నో షోల్లో, ఎన్నో వేదికల మీద నిరూపితమైంది. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా మారిపోయింది. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సింగింగ్ షోలు చేసుకుంటూ వచ్చింది. ఇక స్టార్ మా స్పెషల్ ఈవెంట్లకు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి శ్రీముఖి నెట్టింట్లో రీల్ వీడియోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా రా రా రక్కమ్మ అంటూ అందరినీ ఊపేస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి స్పెషల్ రోల్ చేస్తోంది.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.