Sreemukhi : నీకు ఉందో లేదో నీకు తెలియాలి?.. నూకరాజు పరువుతీసిన శ్రీముఖి

Authored By aruna | The Telugu News | Published on: August 1, 2022, 10:00 pm

Sreemukhi : జాతి రత్నాలు షోలు ఈ మధ్య బాగానే క్లిక్ అవుతోంది. కొత్త వాళ్లను పట్టుకొచ్చి.. స్టాండప్ కామెడీ చేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ షో ఫార్మూలానే మళ్లీ వాడేస్తున్నారు. అయితే ఈ జాతి రత్నాలు మాత్రం ఇప్పుడు బాగానే మెప్పిస్తోంది. అందులోని కామెడీ, పంచ్‌లు బాగానే ఉంటున్నాయి. ఇక శ్రీముఖి, ఇమాన్యుయేల్, నూకరాజు, పంచ్ ప్రసాద్ వంటి వారు బాగానే నెట్టుకొస్తున్నారు. ఈ మధ్య ఇమాన్యుయేల్ ఎక్కువగా హైలెట్ అవ్వడం లేదు గానీ.. నూకరాజు, ప్రసాద్ మాత్రం దుమ్ములేపేస్తున్నారు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో నూకరాజు రెచ్చిపోయాడు. శ్రీముఖి సైతం మధ్యలో పంచులతో ఆడేసుకుంది. తాజాగా వీరంతా కలిసి రంగస్థలం స్పూప్ వేశారు.

జగపతి బాబు పాత్రలో పంచ్ ప్రసాద్.. చిట్టిబాబుగా నూకరాజు.. మహేష్ కారెక్టర్‌ను ఇమాన్యుయేల్.. సమంతగా శ్రీముఖి నటించింది. చెవిటి పాత్రలో నూకరాజు నటించాడు. తనకు వినిపించడం లేదన్నట్టుగా ఇమాన్యుయేల్ కౌంటర్లు వేస్తాడు. నువ్ ఈ షోకు పెద్ద బొక్క అని చేతులు మాత్రం సూపర్ అన్నట్టుగా సైగా చేస్తుంటాడు. ఇక శ్రీముఖి వచ్చి తన పొలం సర్పంచ్ లాక్కున్నాడు అని వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి చెప్పుకుంటుంది. కానీ నూకరాజుకు వినిపించనట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇక తన లౌడ్ స్పీకర్‌తో మొత్తుకుంటుంది. సర్పంచ్ సంగతి చూసి.. నీ పొలం నీకు ఇప్పిస్తా అని నూకరాజు అంటాడు.

Sreemukhi Satires on Nookaraju In Jathi Ratnalu Promo

Sreemukhi Satires on Nookaraju In Jathi Ratnalu Promo

మరి నాకు ఏమైనా ఉందా? అని నూకరాజు డబుల్ మీనింగ్ డైలాగ్‌లో శ్రీముఖిని అడిగేస్తాడు. నీకు ఏమైనా ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నీకే తెలియాలి అంటూ దారుణమైన పంచ్ వేస్తుంది. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. శ్రీముఖి దెబ్బకు ఇమాన్యుయేల్ నోర్మూసుకుంటాడు. అలా నూకరాజుకు ఆ స్కిట్‌లో పలు సందర్భాల్లో సెటైర్లు పడుతుంటాయి. ఏది ఏమైనా కూడా జాతి రత్నాలు షోను పంచ్ ప్రసాద్, శ్రీముఖి, ఇమాన్యుయేల్, నూకరాజులు ముందుండి చక్కగా నడిపిస్తున్నారు. టాప్ రేటింగ్స్ రాకపోయినా జనాలను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp