Sreemukhi : అట్లుంటది రాములమ్మ క్రేజ్‌.. సైమా కోసం భారీ పారితోషికం తీసుకున్న శ్రీముఖి

Authored By aruna | The Telugu News | Published on: September 13, 2022, 11:30 am

Sreemukhi : తెలుగు బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తాజాగా సైమా అవార్డు కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించింది. సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిని కనబరిచే సైమా అవార్డు వేడుకలో యాంకర్ గా వ్యవహరించే అవకాశం రావడం శ్రీముఖి యొక్క ప్రతిభకు నిదర్శనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సైమా అవార్డు వేడుకలో అన్ని భాషలకు సంబంధించి ఒక్కొక్క యాంకర్ ఉంటారు. తెలుగు యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించింది. తమిళం, కన్నడం మరియు మలయాళం నుండి కూడా యాంకర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వారందరి కంటే కూడా అధికంగా శ్రీముఖి పారితోషికాన్ని తీసుకున్నట్లుగా సైమా వర్గాల నుండి సమాచారం అందుతుంది.

రెండు రోజుల డేట్లు ఇచ్చినందుకు గాను ఏకంగా 10 లక్షల రూపాయల పారితోషికం సైమా నిర్వాహకుల నుండి శ్రీముఖి దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో విమాన ప్రయాణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు మొత్తంగా రెండున్నర లక్షలు తీసి వేసినా ఏడున్నర లక్షలు ఆమెకు మిగులు అన్నట్లుగా బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఒకవైపు ఈ టీవీలో జాతి రత్నాలు కార్యక్రమాన్ని చేస్తూనే మరో వైపు ఇలా సందర్భానుసారంగా ఏ ఛానల్లో అవకాశం వస్తే ఆ ఛానల్ కు లేదా ఈవెంట్స్‌ కి వెళ్లి అక్కడ ఎంటర్టైన్మెంట్ ని పండిస్తూ ఉంది.

Sreemukhi SIIMa awards function remuneration record

Sreemukhi SIIMa awards function remuneration record

శ్రీముఖి ఆమధ్య ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు అతడు ఎవరు అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు ఆరు ఏడు నెలలు అయినా కూడా ఇప్పటి వరకు తన ప్రియుడు ఎవరు అనే విషయాన్ని చెప్పక పోవడంతో శ్రీముఖి అతని నుండి విడిపోయిందా అంటూ కొందరు గుసగుసలు చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆమె నోరు తెరిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కూడా తెగ అల్లరి చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియా సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇతర భాషల యొక్క యాంకర్స్ అందరిలోకి శ్రీముఖి పారితోషికం చాలా ఎక్కువగా దక్కించుకుంది. ఇది ఆమె యొక్క ప్రతిభకు మరియు ఆమె యొక్క స్టార్ డం కి నిదర్శనం అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp