Sreemukhi : అందరిలో శేఖర్ మాస్టర్‌తో తాళి కట్టించుకుంటానన్న శ్రీముఖి.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : అందరిలో శేఖర్ మాస్టర్‌తో తాళి కట్టించుకుంటానన్న శ్రీముఖి.. వీడియో !

Sreemukhi : ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరోల దగ్గర్నుంచి ఎనర్జిటిక్ హీరో రాం లాంటి వారి వరకు అందరి సినిమాల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన క్రేజ్ ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ కి బాగా ఉపయోగపడుతోంది. నాలుగైదేళ్లుగా డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీని బుల్లితెర మీద కూడా […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 October 2021,6:56 am

Sreemukhi : ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరోల దగ్గర్నుంచి ఎనర్జిటిక్ హీరో రాం లాంటి వారి వరకు అందరి సినిమాల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన క్రేజ్ ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ కి బాగా ఉపయోగపడుతోంది. నాలుగైదేళ్లుగా డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీని బుల్లితెర మీద కూడా తెచ్చుకున్నాడు.

Sreemukhi Singing Song For shekar master

Sreemukhi Singing Song For shekar master

ఇక ఆయనతో స్మాల్ స్క్రీన్ ఫేమస్ యాంకర్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. రష్మీ, ప్రియమణి, శ్రీముఖి లతో శేఖర్ మాస్టర్ స్టేజ్ మీద వేసే స్టెప్పులు అందరినీ బాగా అలరిస్తున్నాయి. షోలో భాగంగా క్రేజ్ కోసం శేఖర్ మాస్టర్‌ని యాంకర్ చిలిపిగా ప్రవర్తిస్తూ, కౌంటర్స్ ఇస్తూ ఆయనతో సరసాలాడుతూ నానా హంగామా చేస్తున్నారు.

Sreemukhi : శ్రీముఖి.. శేఖర్ మాస్టర్‌ని చూసి దగ్గరికి వెళ్ళి..భుజాల మీద చేతులేస్తూ..!

దీనికి శేఖర్ మాస్టర్ కూడా బాగా రియాక్ట్ అవుతూ వారి చిలిపి చేష్టలకి ఆయన కూడా కాస్త మసాలా కలిపి జనాలకి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ మధ్య ఢీ షో నుంచి తప్పుకున్న శేఖర్ మాస్టర్ స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే షో కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా.

Sreemukhi Singing Song For shekar master

Sreemukhi Singing Song For shekar master

ఈ ప్రోమో శ్రీముఖి Sreemukhi వయ్యారాలు పోతూ వెంకటేశ్ నటించిన గురు సినిమాలోని ఓ సక్కనోడా..అనే పాటను శేఖర్ మాస్టర్‌ని చూసి పాడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి .. భుజాల మీద చేతులేస్తూ.. లిరిక్స్ మొత్తం పాడుతూ తాళి కట్టించుకుంట బాబూ అంటూ శేఖర్ మాస్టర్ మీద పడి ఒగలుపోతూ చిలిపిగా ప్రవర్తించింది. సినిమాలో పాట అయినా ప్రోమోలో శ్రీముఖి Sreemukhi చేసిన అల్లరి పనులు బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్స్ నిజంగా శ్రీముఖికి శేఖర్ మాస్టర్స్ మీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయనుకుంటా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం బాగా హైలెట్ అయింది.

 

Sreemukhi Singing Song For shekar master

Sreemukhi Singing Song For shekar master

 

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది