Sreemukhi : లాంగ్ ఫ్రాక్‌లో శ్రీముఖి క్యూట్ నెస్‌.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: February 21, 2022, 11:00 am

Sreemukhi : బుల్లితెర‌పై తమ మాట‌ల‌తో పాటు అందాల‌తో అల‌రించే ముద్దుగుమ్మ‌ల‌లో శ్రీముఖి కూడా ఒకరు.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్‌గా పరిచయం అయిన ఈ భామ.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఫలితంగా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన శ్రీముఖి.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

ఆ త‌ర్వాత ప‌టాస్‌తో పూర్తి స్థాయి యాంక‌ర్‌గా మారింది. హోస్టుగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.ఎన్నో అంచనాలతో మూడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఫినాలేలో ఓడిపోయింది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత మరింత ఉత్సాహంగా కెరీర్‌ను ముందుకు తీసుకుని వెళ్తోంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో నటించింది.

sreemukhi striking poses in blue trendy out fit

sreemukhi striking poses in blue trendy out fit

Sreemukhi : అందాల ర‌చ్చ చేస్తున్న శ్రీముఖి..

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్’ కొత్త సీజన్‌కు హోస్టుగా వ్యవహరిస్తోంది. గతంలో దీన్ని ప్రదీప్ నడిపించాడు.షో కోసం డిఫ‌రెంట్ కాస్ట్యూమ్‌లో మెరుస్తున్న శ్రీముఖి ఆడ్రెస్‌లో ఫొటో షూట్ చేస్తూనెటిజ‌న్స్ ని అల‌రిస్తుంది. తాజాగా బ్లూ క‌లర్ ట్రెండీవేర్ డ్రెస్‌లో క్యూట్ గా మెరిసి ర‌చ్చ చేస్తుంది శ్రీముఖి. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మ‌మైమ‌ర‌చిపోతున్నారు. శ్రీముఖి అందం, ఆమె ధరించిన డ్రెస్ ఆకట్టుకుంటున్నాయి. కానీ రొటీన్ ఫోజులు ఇస్తోంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp