Sreemukhi : బాపు బొమ్మ‌లా క‌నిపిస్తున్న శ్రీముఖి.. థ్రిల్ అవుతున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : బాపు బొమ్మ‌లా క‌నిపిస్తున్న శ్రీముఖి.. థ్రిల్ అవుతున్న నెటిజ‌న్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :31 July 2022,11:30 am

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌తో పాటు వెండితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. తెలుగు ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న బ్యూటీ శ్రీముఖి. గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. రాముల‌మ్మగా ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ నిత్యం త‌న క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తూ మెంట‌లెక్కిస్తుంది. శ్రీముఖి అంద‌చందాల గురించి ఎంత పొగిడిన త‌క్కువే అని చెప్పాలి.

Sreemukhi : మైమ‌ర‌పిస్తున్న అందాలు..

ఇటీవ‌ల కాస్త స్లిమ్ అయిన శ్రీముఖి సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే ఫొటోలు షేర్ చేస్తూ మెంట‌లెక్కిస్తుంది. చేతులు పైకెత్తి ర‌చ్చ చేసిన ఈ పిక్స్ చూసి మైమ‌ర‌చిపోయిన కుర్ర‌కారు ఇప్పుడు ఎల్లో క‌లర్ డ్రెస్ లో అందాల ఆర‌బోత‌ని చూసి థ్రిల్ అవుతున్నారు. శ్రీముఖిని చూసి బాపు బొమ్మ‌లా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ కి భ‌లే కామెంట్స్ పెడుతున్నారు. శ్రీముఖి క్రేజ్ బ‌ట్టి ఆమె పిక్స్ ఎప్పుడు షేర్ చేసిన తెగ వైర‌ల్ అవుతుంటాయి.

sreemukhi stunning looks viral

sreemukhi stunning looks viral

ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. మ‌ధ్య‌లో సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో చిత్రాల‌తో ప‌ల‌క‌రించింది. ఇప్పుడు భోళా శంక‌ర్ చిత్రంలో న‌టిస్తుంది. ఇందులో శ్రీముఖి పాత్ర అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి