Anchor Suma : టీఆర్పీ కోసం పిచ్చి వేషాలు వేయించిన సుమ.. చేతిలో కర్పూరం, మెడలో తాళి కట్టమన్న యాంకర్

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 11:00 am

Anchor Suma : బుల్లితెరపై సుమ చేసే షోలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎక్కడా సఅభ్యకరంగా ఉండవు.. అభ్యంతరకంగా ఉండవు అని అందరూ అనుకుంటారు. సుమ ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. ఈ మధ్య సుమ కూడా హద్దులు దాటుతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లతో షోలో దుమ్ములేపుతోంది. వచ్చిన గెస్టులు అలానే ఉంటున్నారు.. సుమ కూడా అలానే తయారైంది. తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. తాజాగా ఇందులో చేయకూడని పనులను చేయించింది. వచ్చే వారం ఎపిసోడ్‌‌లో జంటలను తీసుకొచ్చింది. జబర్దస్త్ జోడిలతో ఆట ఆడించింది. ఇందులో షబీనా కెవ్వు కార్తీక్, పరదేశీ భాను, ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలను తీసుకొచ్చింది సుమ.

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలది నిజమైన ప్రేమ అని అందరికీ తెలిసిందే. ఈ రెండు జోడిలు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమను నిరూపించమని సుమ అడిగింది. దీని కోసం ప్రమాదకరమైన పనులును చేయమని కోరింది. నీది నిజమైన ప్రేమ అయితే.. చేతి మీద కర్పూరం వెలిగించుకో.. అది పూర్తిగా కాలిపోయే వరకు ఉండాలి అని నూకరాజుని అడిగింది. దీంతో నూకరాజు ధైర్యంగా ఆ కర్పూరాన్ని తన చేతి మీద వెలిగించుకున్నాడు. ఇక ఆసియా మాత్రం వద్దు వద్దు అంటూ ఏడుస్తూనే ఉంది. అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆసియా మాత్రం ఏడుస్తూ ఉంది.

Anchor Suma Asks Nooka Raju To Prove His LOve on Asia

Anchor Suma Asks Nooka Raju To Prove His LOve on Asia

ఈ సాహసం అయిన తరువాత.. మరో చాలెంజ్ పెట్టేసింది. ఇక్కడే అందరి ముందు తాళి కట్టేయాలి అని ఓ తాళిని కూడా తీసుకొచ్చింది సుమ. నూకరాజు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాళి కట్టేందుకు ముందుకు వెళ్లాడు. కానీ ఇది జరగనట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ సమక్షంలో అందరి ముందే కట్టాలని అనుకుంటున్నాడేమో. ఈ ప్రోమో మాత్రం ఇలాంటి యాక్టివిటీస్‌తో నిండటంతో సుమను ఏకిపారేస్తున్నారు. నూకరాజు ఆసియా ప్రేమను పొగిడేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp