Home » Entertainment » Sri Reddy Again Targeted Daggubati Abhiram
Entertainment

Sri Reddy : ద‌గ్గుబాటి త‌న‌యుడిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. నెగెటివ్ కామెంట్స్ వైర‌ల్

Authored By
Sam C
The Telugu News | Published on: September 16, 2022, 6:30 pm
Advertisement

Sri Reddy : ద‌గ్గుబాటి అభిరామ్.. ఈ పేరు చెప్ప‌గానే వెంట‌నే శ్రీరెడ్డి గుర్తుకు వ‌స్తుంది. అందుకు కార‌ణం శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో మ‌నోడిని మొద‌ట టార్గెట్ చేసి నానా హంగామా చేసింది. అభిరామ్ తనకు హీరోయిన్‌గా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని ఒదిలేసాడని చెప్పడంతో పాటు అతనితో చనువుగా ఉన్న ఫోటోలను బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. దీంతో అభిరామ్ ఒక్క సినిమా చేయ‌కుండానే ఫుల్ పాపుల‌ర్ అయ్యాడు. అయితే ఇన్నాళ్ల‌కు అభిరామ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Advertisement

Sri Reddy : టార్గెట్ చేస్తుందా?

ఇటీవ‌ల చిత్ర ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది ఆక‌ట్టుకునేలా ఉంది. అహింస సినిమాలో అభిరామ్ రఘు అనే కుర్రాడి పాత్ర చేస్తుండగా.. హీరోయిన్ గీతిక అహల్య పాత్రలో కనిపిస్తోంది. అయితే ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కాగానుండ‌గా, శ్రీ రెడ్డి త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న కామెంట్స్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అభిరామ్‌ని టార్గెట్ చేస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని అభిరామ్ మోసం చేశాడని తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించిన ఆమె ఫోటోలతో సహా లీక్ చేసి సంచలనం రేపిన విష‌యం తెలిసిందే.

Sri Reddy Again Targeted Daggubati Abhiram

Advertisement

ఇటీవ‌ల అభిరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలో మంచి కంటెంట్ కంటెంట్ తో సహా మెసేజ్ కూడా ఉండాలని ఆయన కోరాడు.. ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని ఆ సినిమా చూశాక మీరే విషయం ఒప్పుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తన గత జీవితాన్ని ఓపెన్ చేసి చూపించినట్లు జనం ఫీలవుతారని ఈ సినిమా ద్వారా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి