Sri Reddy : శ్రీ రెడ్డి శాపం పెట్టింది .. ఆ హీరో జీవితం సర్వనాశనం అయ్యింది !

Authored By aruna | The Telugu News | Published on: June 6, 2023, 11:00 am

Sri Reddy : రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేక పరిచయాల అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయ మీద క్లాస్ పీకుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటూ ఉంటుంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ నినాదంతో రచ్చ రచ్చ చేసింది. కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ వార్తలకి ఎక్కింది. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఎక్స్పోజింగ్ తో నెటిజన్లను పిచ్చెక్కిస్తుంది. అలాగే కొందరి రాజకీయ నాయకులను కూడా నానా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంటుంది.

సినిమాలో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా నానాహంగామా చేస్తూ ఉంటుంది. ఇక ఆమె వేసుకునే బట్టలు చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. కేవలం తన ఫోటోలు కాకుండా పలు రకాల కామెంట్లతో వివాదాలు సృష్టిస్తుంది. ఇక ఆమె పెట్టే ప్రతీ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమధ్య యూట్యూబ్లో సొంత ఛానల్ పెట్టి వంటలతో పాటు అందాన్ని కూడా వడ్డించింది. ఈ వీడియోలకి యూత్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లి అక్కడ సెటిల్ అయిందని తెలుస్తోంది. ఇకపోతే శ్రీ రెడ్డి దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో గతంలో క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బాగా హల్చల్ చేసింది.

Sri Reddy cursed, that hero's life has been destroyed

Sri Reddy cursed, that hero’s life has been destroyed

ప్రేమ పేరుతో అభిరామ్ తనను మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చి అతడి పరువు మొత్తం తీసేసింది. అయితే ఇంత కాలానికి అభిరామ్ ఇండస్ట్రీలోకి హీరోగా అహింస సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో శ్రీరెడ్డి గతంలో అభిరామ్ గురించి పచ్చి నిజాలు బయటపెట్టింది. మొత్తానికి అభిరామ్ మొదటి సినిమాతో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలామంది గతంలో అభిరామ్ చేసిన పనులను తలచుకుంటూ శ్రీరెడ్డి శాపం బాగా తగిలింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp