Sri Reddy : పదివేలు పెట్టి పుల‌స చేప కొన్న శ్రీ రెడ్డి.. మ‌సాలా ద‌ట్టించి పులుసు గట్టిగానే పెట్టిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 16, 2022, 12:00 pm

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ అమ్మడు ఒక‌ప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌తో ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శ్రీరెడ్డి ఇప్ప‌టికీ కూడా ఏదో సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తుందట. శ్రీరెడ్డి యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది.

శ్రీ రెడ్డి ఒక‌వైపు అందాలు ఆర‌బోస్తూ ర‌కర‌కాల వంట‌లు చేస్తూ అల‌రిస్తుంది. ఇటీవ‌ల కాలంలో శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. బిర్యానీ చేసే విధానం.. వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. తాజాగా ఈ అమ్మ‌డు ప‌దివేలు పెట్టి పుల‌స చేప కొని మ‌సాలాలు ద‌ట్టించి చేప‌ల పులుసు వండింది. శ్రీ రెడ్డి పుల‌స చేప‌ల కూర అదిరిపోయింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వంట వండుతూనే శ్రీ రెడ్డి ప‌లు విష‌యాల గురించి చెప్పుకొచ్చింది.

Sri Reddy latest Recipie video on youtube

Sri Reddy latest Recipie video on youtube

Sri Reddy : వారెవ్వా ఏమి రుచి..

శ్రీరెడ్డి తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. ఆ మ‌ధ్య నల్లి బొక్కల కూర వండింది. తెలంగాణ ప్రజల కోసం ఇది చేసానంటూ చెప్పుకొచ్చిన శ్రీ రెడ్డి.. ఇది తింటే రాత్రి మూలగాల్సిందే అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోని జ‌నాలు పిచ్చిపిచ్చిగా చూసేసారు. ప్ర‌తి వీడియోల‌ను ఏదో ఒక కొత్త ద‌నం చూపిస్తూ శ్రీరెడ్డి తెగ ర‌చ్చ చేస్తుంది. మొత్తానికి శ్రీరెడ్డి చేస్తున్న ర‌చ్చ‌కు తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోతున్నాయి. శ్రీరెడ్డి ఒక‌వైపు యూట్యూబ్‌లో సంద‌డి చేస్తూనే సెల‌బ్రిటీల‌పై విరుచుకుప‌డుతూనే ఉంది. ఆ మ‌ధ్య లైగ‌ర్ చిత్ర టీంపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp