Sri Reddy : మేక కూర వండిన శ్రీరెడ్డి.. బాబోయ్ ఈ ర‌చ్చేందంటున్న నెటిజ‌న్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : మేక కూర వండిన శ్రీరెడ్డి.. బాబోయ్ ఈ ర‌చ్చేందంటున్న నెటిజ‌న్స్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 March 2022,3:38 pm

Sri Reddy: శ్రీరెడ్డి.. ఈవిడ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో రచ్చ చేసి, మీడియా ముందుకి వచ్చి ఒక్కసారిగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ శ్రీరెడ్డి. ఫిలిం ఛాంబర్ ముందు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి బాధితులైన ఆడవాళ్ళకి న్యాయం చేయాలి అంటూ గొడవ చేస్తూ సినీ ప్రముఖులందర్నీ తిట్టింది. ఇందులో భాగంగా చిరంజీవి తల్లిని కూడా అనరాని మాటలు అంది. ఇది జరిగి చాలానే సంవత్సరాలైంది. ఇటీవ‌ల నేను తప్పుచేశాను. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అంజనమ్మా’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాత్రం విరుచుకుప‌డుతూనే ఉంది.

ఇటీవ‌లి కాలంలో శ్రీ రెడ్డి పొలాల చుట్టూ తిరుగుతూ వంట‌లు చేస్తుంది. ఆ మ‌ధ్య చేప‌ల కూర చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు మేక తొడ కూర వండింది. మంచిగా పిల్ల‌ల మ‌ధ్య కూర్చొని తాను చేసిన వంట‌ని చ‌క్క‌గా ఆస్వాదించింది. రుచి చ‌క్క‌గా ఉంద‌ని పేర్కొంది. వీడియోలో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ‌కు వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. నటి శ్రీరెడ్డి భారీగానే ఆస్తులు కూడబెట్టిందంటూ గట్టిగానే ప్రచారం ఉంది. ఖరీదైన విల్లాతో పాటు.. లగ్జరీ కారు.. విలువైన ఆస్తులు బాగానే కూడబెట్టిందని టాక్ గట్టిగానే ఉంది. శ్రీరెడ్డికి హైదరాబాద్‌‌లో మంచి ఖరీదైనా విల్లా ఉన్న మాట వాస్తవమే. అయితే కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. శ్రీరెడ్డి పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లాలో కూడా బాగానే ఆస్తులు ఉన్నాయి.

sri reddy shares cute video

sri reddy shares cute video

Sri Reddy : శ్రీ రెడ్డి ర‌చ్చ పీక్స్‌లో..

తాజాగా తన ఆస్తులు, పంట పొలాలను చూపిస్తూ వీడియో వదులుతుంది శ్రీరెడ్డి. ఆ మ‌ధ్య తాను కొనుగోలు చేసిన స్థలాన్ని చూపించింది శ్రీరెడ్డి. దేవుడి దయ ఉంటే.. ఈ పల్లె వాతావరణంలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందంటూ.. తన పొలంలో విరిగిగా పెరిగిన మునగ చెట్లును చూపించింది శ్రీరెడ్డి. అక్కడే ఉన్న గుమ్మడిపాదులు.. గడ్డి వాములు, అరటి తోటలు, చెరువు గట్లు చూపిస్తూ సందడి చేసింది శ్రీరెడ్డి. తన సొంత పొలంలో వరినాట్లు వేయిస్తూ.. అక్కడ పని చేస్తున్న కూలీలతో ముచ్చటించింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి అమ్మమ్మగారి ఊరు పసలపూడి. ఆ ఊరిలోనే పుట్టిపెరిగింది శ్రీరెడ్డి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది