Sri Reddy : సూక్తులు చెబుతూ రుచిక‌ర‌మైన బిర్యాని వండిన శ్రీ రెడ్డి..!

Authored By Sam C | The Telugu News | Published on: August 24, 2022, 1:00 pm

Sri Reddy : వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ప‌లు ర‌కాల వంట‌కాలని ప‌రి చేయం చేస్తున్న‌విష‌యం తెలిసిందే. పల్లెటూరి పిల్లలాగా కట్టుబొట్టు మార్చి పల్లెటూరి యాసలో మాట్లాడుతూ వివిధ రకాల వంటలను తయారు చేసి అందరికీ రుచి చూపిస్తోంది. శ్రీరెడ్డి వంట‌కాలు చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాక వీలుంటే కొంద‌రు ఆ రుచిక‌ర‌మైన భోజ‌నం ఆర‌గించాల‌ని కూడా ఎంతో ఆశ‌ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల శ్రీ రెడ్డి వంట‌కాల స్టైల్ మార్చింది. ఓవైపు రుచిక‌ర‌మైన వంటకాలు చేస్తూనే మ‌రో వైపు నీతి సూక్తులు కూడా చెబుతోంది.

Sri Reddy : ఆహా.. ఏమి రుచి..!

శ్రీ రెడ్డి పిల్లల పెంపకం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందని, ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి చేయవద్దు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సమాజంలో స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయం గురించి కూడా వల్లించింది. స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు శరీరం మొత్తం కప్పుకునేలా దుస్తులు ధరించాలని చెప్పింది. తాజాగా పిల్ల‌ల‌ని తిట్టొద‌ని మ‌న పెంప‌క‌మే మ‌న‌ల్ని తిరిగి కాపాడుతుంద‌ని ప‌లు సూక్తులు చెప్పింది. శ్రీ రెడ్డి పంథా భ‌లేగుందిగా అంటూ కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు.

sri reddy tasty biryani video on youtube

sri reddy tasty biryani video on youtube

మొత్తానికి శ్రీ రెడ్డి యూట్యూబ్ ద్వారా భ‌లే వినోదం పంచుతుందిగా. శ్రీ రెడ్డికి డేరింగ్ కూడా ఎక్కువే. ఏదో మాటలు చెప్పడం కాదు.. తరచూ చేతల్లో కూడా చూపిస్తుంటుంది శ్రీరెడ్డి. చూపించడం అంటే శ్రీ రెడ్డి రొటీన్ తరహా ప్రదర్శన కాదు కానీ.. తనలోని డేరింగ్ నెస్‌ను చెన్నై వీధుల్లో కూడా ప్రదర్శించి హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి.. ఎంతోమంది ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులకు నిద్రపట్టకుండా చేసిన శ్రీరెడ్డి. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆ ఒక్క ఎపిసోడ్‌తో శ్రీరెడ్డి పేరు మారు మోగిపోయింది. ఆ తరువాత నుంచి పాప బాదుడు మామూలుగా లేదు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp