Bigg Boss 6 Telugu : పనులు చేతగాక నీతులు చెబుతోందిగా.. బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య చేసేది ఇదే

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 15, 2022, 12:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య వెరైటీగా అనిపిస్తోంది. ఆమె పనులు చేయడం తక్కువ.. మాటలు చెప్పడం మాత్రం ఎక్కువ అన్నట్టుగా ఉంది. తినడానికి బిగ్ బాస్ ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆటల్లోనూ ఏ మాత్రం సీరియస్‌నెస్ కనిపించడం లేదు. అలా మొత్తానికి గ్లామర్ షోతో శ్రీ సత్య నెట్టుకొస్తోంది. అలా అని మరీ ఎక్స్‌పోజింగ్ ఏమీ చేయడం లేదు. కానీ పొట్టి బట్టల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది.

ఇందులో భాగంగా అందరికీ ఓ బొమ్మను ఇచ్చాడు. ఆ బొమ్మను బిడ్డగా భావించాలని, దాని బాగోగులు చూసుకుంటూ సంరక్షించుకోవాలని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. వేరే కంటెస్టెంట్ల బొమ్మను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఎవ్వరైనా పడేయొచ్చని తెలిపాడు. అలా చేస్తే బొమ్మని కోల్పోయిన కంటెస్టెంట్లు ఆట నుంచి తప్పుకుంటారు. దీంతో గీతూ మిగతా కంటెస్టెంట్ల బొమ్మల మీద పడింది. ఎవరి బొమ్మ దొరికితే వాళ్లది తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేస్తూ వచ్చింది. భోజనానికి అందరూ సిద్దమయ్యారు.

Sri Satya Loses task in Bigg Boss 6 Telugu

Sri Satya Loses task in Bigg Boss 6 Telugu

ప్లేటులో భోజనం పెట్టుకునేందుకు తన బొమ్మని పక్కన పెట్టేసింది సత్య. దీంతో ఆ బొమ్మను ఎత్తుకెళ్లింది గీతూ. అది చూసినా కూడా సత్య రియాక్ట్ అవ్వలేదు. లైట్ తీసుకుంది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదని టాస్కుని తీసి పారేసింది. బ్యాడ్ కెప్టెన్ అవ్వడం కంటే.. కెప్టెన్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అంటూ ఓ సూక్తి వ్యాఖ్యలు చేసింది. అలా మాటలు చెప్పడమే తప్పా.. చేతల్లో మాత్రం శ్రీ సత్య శూన్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇలాంటి సత్య ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp