Srikanth Meka : ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శ్రీకాంత్.. ఎందుకో తెలుసా?
Srikanth Meka : ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ మేక. హీరోయిన్ ఊహను మ్యారేజ్ చేసుకున్న శ్రీకాంత్..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. ఆ తర్వాత కాలంలో వచ్చిన సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు.శ్రీకాంత్ హీరోగా నటించిన తొలి సినిమా ‘తాజ్ మహల్’ కాగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెళ్లి సందడి’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత శ్రీకాంత్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాత కాలంలో శ్రీకాంత్‌కు హీరోగా అవకాశాలు రాని నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను నటించాడు. మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే, ఒకానొక దశలో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.తన తండ్రితో గొడవపడిన సందర్భంలో తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. తాను ఒక విషయంలో తప్పు చేసినపుడు తన తండ్రి వార్నింగ్ ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు.
Srikanth Meka : లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న శ్రీకాంత్..ఇప్పుడు విలన్‌గానూ..
తనను కొడితే తాను చెరువులో దూకి చనిపోతానని తండ్రిని బెదిరించానని చెప్పుకొచ్చాడు హీరో శ్రీకాంత్. ‘అఖండ’ చిత్రం సక్సెస్‌ను శ్రీకాంత్ ప్రజెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ‘వరదరాజులు’ క్యారెక్టర్‌ను అత్యద్భుతంగా ప్లే చేశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు విలన్ రోల్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు శ్రీకాంత్ థాంక్స్ చెప్పాడు. ఫ్యామిలీ హీరోగా పేరున్న శ్రీకాంత్ విలన్‌గా మారిపోయాడు. శ్రీకాంత్ ఈ చిత్రంతో పాటు శాండల్ వుడ్ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ ఫిల్మ్ ‘జేమ్స్’లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.