Kotabommali PS Movie : కోట బొమ్మాళి సక్సెస్ మీట్ లో రిపోర్ట‌ర్ ప్ర‌శ్న స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన‌ జీవిత రాజశేఖర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kotabommali PS Movie : కోట బొమ్మాళి సక్సెస్ మీట్ లో రిపోర్ట‌ర్ ప్ర‌శ్న స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన‌ జీవిత రాజశేఖర్..!

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Kotabommali PS Movie : కోట బొమ్మాళి సక్సెస్ మీట్ లో రిపోర్ట‌ర్ ప్ర‌శ్న స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన‌ జీవిత రాజశేఖర్..!

  •  కోటబొమ్మాళి సినిమా నవంబర్ 24 న విడుదలై సూపర్ హిట్ టాక్

Kotabommali PS Movie : శ్రీకాంత్ , వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ కోటబొమ్మాళి ‘ సినిమా నవంబర్ 24 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కుప్పినీడి నిర్మించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు జీవిత రాజశేఖర్ సమాధానమిచ్చారు.

మీరు ఒక పోలీస్ అయ్యుండి ఎందుకు అలా భయపడ్డారు అని విలేకరి అడగగా దానికి బదులుగా జీవిత రాజశేఖర్ ఆ పాత్రను డైరెక్టర్ అలా డిజైన్ చేశారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నేను నటించాను. అందరూ ఒక్కలా ఉండరు కొందరికి మొహమాటం , భయం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లి మాత్రమే ఉన్నది. ఆమెకు కూడా ఒంట్లో బాలేదు, ఇల్లు తనే నడపాలి, ఇలా తనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ కుమారి పాత్ర కూడా అలాంటిదే అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి నేను ముందు భయపడ్డాను. కానీ ఈ పాత్రకు వస్తున్న ఆదరణ చూసి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమా టైంలో ఎటువంటి గుర్తింపు వచ్చిందో ఈ సినిమా ద్వారా నాకు అంతే గుర్తింపు వచ్చింది. గీత ఆర్ట్స్లో మరోసారి నటించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దర్శకుడు తేజ మార్ని ప్రతిభ గలవాడు. భవిష్యత్తులో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతారు అని అన్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది