Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప2 కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. దాంతో అనుకున్న టైమ్ కు అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహం ఫ్యాన్స్ లో నెలకొంది. ఇక విడుదలకు ముందే పుష్ప 2 క్రేజీ రికార్డును నెలకొల్పింది. ఆ లిస్ట్ లో టాప్ లో నిలిచి ఔరా అనిపించింది.
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలతో పాటుగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల లిస్ట్ ను ఐఎండీబీ ప్రకటించింది. జనవరి నుంచి జులై 10 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను విడుదల చేయగా, ఇందులో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో టాప్‌లో పుష్ప 2 నిలిచింది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 కోసం ఏకంగా 8 సినిమాలు వదులుకున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ యాక్టర్ శ్రీతేజ్. ఇతను పుష్ప, ధమాకా, మంగళవారం లాంటి విభిన్నమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ పుష్ప 2లో నటించడం కోసం తాను ఏకంగా 8 సినిమాలు వదులుకున్నట్లు స్వయంగా చెప్పాడు.
నేను పది నెలల్లో దాదాపు 8 ప్రాజెక్ట్ ల దాక వదులుకున్నాను. ఎందుకంటే? ఇంత పెద్ద సినిమాలో చేస్తున్నప్పుడు వాళ్లు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాల్సి వస్తుంది. పైగా షెడ్యూల్స్ కూడా మారుతూ ఉంటాయి. నేను వేరే సినిమాలు ఒప్పుకొని గడ్డం తీసేస్తే.. మళ్లీ ఈ రేంజ్ లో గడ్డం పెరగడానికి చాలా టైమ్ పడుతుంది. దాంతో సినిమాపై ప్రభావం పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం ఇన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీతేజ్. ప్రస్తుతం శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బహిష్కరణ’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అంజలి, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.