
rrr SS rajamouli decision lost to the producer
SS Rajamouli : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి SS Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా, దర్శకధీరుడు అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ మూవీలో తొలుత హీరోలుగా రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లను అనుకోలేదట.ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీంగా తారక్ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘బాహుబలి : ది కంక్లూషన్’ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్టోరి డిస్కషన్స్ సమయంలో రాజమౌళి సినిమాకు సరిపోయే కథనాయకుల గురించి చర్చ జరిపాడట. ఆ చర్చకు సంబంధించిన వివరాలు స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు.
SS Rajamouli about On RRR Movie
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్-ఎన్టీఆర్, అల్లు అర్జున్-ఎన్టీఆర్, కార్తీ- సూర్య, కార్తీ- అల్లు అర్జున్ ఇలా రకరకాలుగా కాంబినేషన్స్‌ను రాజమౌళి అనుకున్నాడట. చివరకు రామ్ చరణ్ తేజ్- తారక్ కాంబినేషన్ సెట్ చేసి.. ఎవరూ ఊహించిన విధంగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేశాడు దర్శక ధీరుడు. మొత్తంగా టాలీవుడ్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని కాంబినేషన్‌ను రాజమౌళి సెట్ చేసి సినిమా తీశాడు.ఈ సినిమా సంచలనాలు సృష్టించబోతుందని మూవీ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’సినిమాను మించిన సంచలనాలను ‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ చేయబోతున్నదని అంటున్నారు.
SS Rajamouli about On RRR Movie
ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి అందించే మ్యూజిక్ హైలైట్‌గా నిలవబోతుందని చెప్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తారక్, చెర్రీ టీజర్స్, దోస్తీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి డ్యాన్స్ నెంబర్ విడుదల కాబోతున్నది. ఈ సాంగ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌లో ఇరగదీస్తారని, నాటుగా డ్యాన్స్ చేస్తారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ను చూస్తే అర్థమవుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.