Home » Entertainment » Ss Rajamouli Doing Highest Budget India Film With Mahesh Babu
Entertainment

Mahesh Babu : 1000 కోట్లతో రాజమౌళి – మహేష్ బాబు సినిమా .. దిల్ రాజు కూడా ఒక పార్ట్నర్ ..

Authored By
aruna
The Telugu News | Updated on: January 24, 2024 5:40 pm
Advertisement
Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అంటే ఆ ప్రాజెక్టుకు ఎనలేని క్రేజ్ ఏర్పడుతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమా తర్వాత రాజమౌళితో సినిమాను పట్టాలెక్కించాలని ఆగారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక మహేష్ బాబు తదుపరి ప్రాజెక్టు రాజమౌళితో అవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక రాజమౌళి కూడా అంచనాలకు తగ్గట్టుగానే అంతే స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తారు. మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నారు. నిజానికి సినిమాకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కేఎల్ నారాయణ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ క్రితం ఆయనకు జక్కన్న మహేష్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. అయితే ఈ సినిమా భారీ అడ్వెంచర్ నేపథ్యంలో వస్తుంది. దాదాపుగా ఈ ప్రాజెక్టుకు వెయ్యికోట్లు బడ్జెట్ అవుతుందని ఇప్పటికీ వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ బిగ్ ప్రాజెక్టు లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

అందులో ప్రముఖంగా దిల్ రాజు పేరు బాగా వినిపిస్తుంది. ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరోవైపు ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ తొలిసారి ఒక తెలుగు సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతవరకు డిజిటల్ వరకే ఉన్న నెట్ఫ్లిక్స్ మహేష్ బాబు సినిమాతో థియేట్రికల్ బిజినెస్ లోకి అడుగు పెట్టేందుకు ఆలోచన చేస్తుందట. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఎన్ని వందల కోట్లు అయినా పెట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపిందట. కానీ ఈ ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు రాజమౌళి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి