Mahesh Babu : మహేశ్ బాబు సినిమా కోసం తమిళ్ స్టార్ హీరోను విలన్ గా తీసుకున్న రాజమౌళి.. జక్కన్న సెలెక్షన్ సూపర్బ్?
Mahesh Babu : టాలీవుడ్ బిగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా.. ప్రపంచ వ్యాప్తంగా.. జనవరి 7, 2022 న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు జక్కన్న. ఆ సినిమా తర్వాత జక్కన్న.. తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయనున్నాడు.

ss rajamouli fixes tamil hero vikram as villian role in mahesh babu movie
మహేశ్ బాబుతో సినిమా తీయాలన్నది జక్కన్న కల. కానీ.. ఇన్ని రోజులు కుదరలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతోనే సినిమా ఉంటుందని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. అది కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ సినిమా కోసం కథ కూడా రెడీ అవుతోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటుంది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు.
Mahesh Babu : చాలా స్ట్రాంగ్ గా విలన్ రోల్
అయితే.. ఈ సినిమాలో హీరో రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుందట. అందుకే.. మహేశ్ సినిమా కోసం ఏకంగా విలన్ గా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ను సెలెక్ట్ చేసుకున్నాడట రాజమౌళి. ఇప్పటికే.. విక్రమ్ తో సంప్రదింపులు జరగడం.. విక్రమ్ కూడా ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయట.

ss rajamouli fixes tamil hero vikram as villian role in mahesh babu movie
అధికారికంగా.. త్వరలోనే రాజమౌళి మహేశ్ బాబు సినిమా గురించి.. విలన్ గా విక్రమ్ గురించి మీడియాకు తెలియజేస్తారట. ఈ సినిమాను డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమాను సంవత్సరం లోపే పూర్తి చేయాలని జక్కన్న నిర్ణయించుకున్నారట. అంటే.. 2023 సంక్రాతి లోపు మహేశ్ బాబు, రాజమౌళి కాంబో సినిమాను వెండితెరపై చూసే అవకాశం ఉంటుందన్నమాట.