SS Rajamouli : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇండస్ట్రీ మొత్తం మాత్రం ఆయనను దర్శక ధీరుడు అంటుంటారు. దీనికి కారణం ఆయన ఇప్పటి వరకు ఒక్క పరాజయాన్ని కూడా చూసింది లేదు. పైగా రాజమౌళి దర్శకత్వంలో హీరో సినిమా చేస్తే ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, రవితేజ, సునీల్‌లతో రాజమౌళి సినిమాలు చేశారు. అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించాయి. అంతేకాదు, రాజమౌళి సినిమా చేసి హిట్ అందుకున్న హీరో ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్‌ను మూటగట్టుకుంటాడనే టాక్ ఉంది. ఇది నిజం కూడా. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా నుంచి రాజమౌళి కోసం మన హీరోలు నెలలకొద్దీ కసరత్తులు చేసి ఒళ్ళు హూనం చేసుకోవాల్సి వస్తోంది.
దీనికి కారణం రాజమౌళి తండ్రి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తయారు చేసే కథల్లో హీరో పాత్రకు సిక్స్ ప్యాక్ బాడీ తప్పనిసరి అవుతోంది. బాహుబలి సిరీస్ సినిమాలలో ప్రభాస్, రానా ఇలాగే కండలు చూపించేందుకు ట్రైనర్స్ సమక్షంలో గంటలకొద్దీ జిం లో కసరత్తులు చేసి వస్తాదుల్లా ఒళ్ళు పెంచారు. ఆ బాడీతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు కూడా థ్రిల్ అయ్యారు.ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా హీరోలు ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ఎంతగా శ్రమించారో సినిమాలో చూస్తేనే అర్థమవుతోంది.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు వంతు వచ్చింది. ఈ ఏడాది రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా మొదలవబోతోంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మహేశ్ ..దీని సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రాజమౌళి సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ రాజమౌళి సినిమా అంటే అంతే. ఎలాంటి హీరోకైనా ఒళ్ళు హూనం కాక తప్పదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారట.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.