SS Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే మన హీరోల ఒళ్ళు హూనమవ్వాల్సిందే..

Advertisement

SS Rajamouli : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇండస్ట్రీ మొత్తం మాత్రం ఆయనను దర్శక ధీరుడు అంటుంటారు. దీనికి కారణం ఆయన ఇప్పటి వరకు ఒక్క పరాజయాన్ని కూడా చూసింది లేదు. పైగా రాజమౌళి దర్శకత్వంలో హీరో సినిమా చేస్తే ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, రవితేజ, సునీల్‌లతో రాజమౌళి సినిమాలు చేశారు. అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించాయి. అంతేకాదు, రాజమౌళి సినిమా చేసి హిట్ అందుకున్న హీరో ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్‌ను మూటగట్టుకుంటాడనే టాక్ ఉంది. ఇది నిజం కూడా. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా నుంచి రాజమౌళి కోసం మన హీరోలు నెలలకొద్దీ కసరత్తులు చేసి ఒళ్ళు హూనం చేసుకోవాల్సి వస్తోంది.

దీనికి కారణం రాజమౌళి తండ్రి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తయారు చేసే కథల్లో హీరో పాత్రకు సిక్స్ ప్యాక్ బాడీ తప్పనిసరి అవుతోంది. బాహుబలి సిరీస్ సినిమాలలో ప్రభాస్, రానా ఇలాగే కండలు చూపించేందుకు ట్రైనర్స్ సమక్షంలో గంటలకొద్దీ జిం లో కసరత్తులు చేసి వస్తాదుల్లా ఒళ్ళు పెంచారు. ఆ బాడీతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు కూడా థ్రిల్ అయ్యారు.ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా హీరోలు ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ఎంతగా శ్రమించారో సినిమాలో చూస్తేనే అర్థమవుతోంది.

Advertisement
SS Rajamouli movie of hero should Mahesh Babu Pumping Iron In Gym
SS Rajamouli movie of hero should Mahesh Babu Pumping Iron In Gym

Rajamouli: రాజమౌళి సినిమా అంటే అంతే. ఎలాంటి హీరోకైనా ఒళ్ళు హూనం కాక తప్పదు..

ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు వంతు వచ్చింది. ఈ ఏడాది రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా మొదలవబోతోంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మహేశ్ ..దీని సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రాజమౌళి సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ రాజమౌళి సినిమా అంటే అంతే. ఎలాంటి హీరోకైనా ఒళ్ళు హూనం కాక తప్పదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

Advertisement
Advertisement