SS Rajamouli : అమెరికాలో ఇల్లు అద్దెకి తీసుకున్న రాజమౌళి.. మ్యాటర్ తెలిసి మహేష్ బాబుకి ఫ్యూజ్ ఎగిరిపోయింది..!
SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయనది ఇప్పుడు ఆస్కార్ రేంజ్. తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ ను ముద్దాడింది అంటే దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పుకోవాలి. ఆయన ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు.. హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్. జక్కన్న తెలుగు సినిమాలు తీయడానికి కాదు.. ఆయనది హాలీవుడ్ సినిమాలు తీసే రేంజ్ అంటూ జూనియర్ ఎన్టీఆరే చెప్పారు అంటే.. రాజమౌళి రేంజ్ ఏంటో ఆయనకున్న క్రేజ్ ఏంటో […]
SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయనది ఇప్పుడు ఆస్కార్ రేంజ్. తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ ను ముద్దాడింది అంటే దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పుకోవాలి. ఆయన ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు.. హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్. జక్కన్న తెలుగు సినిమాలు తీయడానికి కాదు.. ఆయనది హాలీవుడ్ సినిమాలు తీసే రేంజ్ అంటూ జూనియర్ ఎన్టీఆరే చెప్పారు అంటే.. రాజమౌళి రేంజ్ ఏంటో ఆయనకున్న క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆస్కార్ అవార్డుతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చిస్తున్నాయి.
ఒక ఇండియన్ సినిమా.. అందులోనూ తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. మళ్లీ ఆస్కార్ అవార్డు అందుకోవాలంటే ఒక తెలుగు సినిమా మళ్లీ ఎన్నేళ్లు వెయిట్ చేయాలో తెలియదు. రాజమౌళి డైరెక్టర్ గా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేస్తుకున్నారు. ఆయన తీసిన సినిమాలు ఇప్పటి వరకు సూపర్ డూపర్ హిట్ అయినవే కానీ.. ఏ సినిమా కూడా యావరేజ్ గా ఆడలేదు. రాజమౌళి సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే అనడంతో సందేహం లేదు. ఈగను హీరోగా పెట్టి సినిమా తీసి చరిత్ర సృష్టించిన ఘనత రాజమౌళిది.
SS Rajamouli : దర్శకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత రాత్రి ఒక ఇంట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్ తో కలిసి రాజమౌళి పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీని అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లో చేసుకున్నారట. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలోనే ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారట రాజమౌళి. లాస్ ఏంజెల్స్ లో ఆ ఇంటిని రాజమౌళి అద్దెకు తీసుకున్నారట. ధర ఎక్కువైనా కూడా ఈ మధ్య ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చాలా సార్లు రాజమౌళి అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే.. దాన్ని రెంట్ కు తీసుకున్నారట. ఆస్కార్ అవార్డు అందుకోగానే అందులోనే సినిమా యూనిట్ మొత్తం పార్టీ చేసుకుందట.