Star Beauty ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చెసుకున అత్యంత అందమైన అమ్మాయి ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 January 2023,9:40 pm

Star Beauty : ఫ్యాషన్ డిజైనర్ గా సక్సెస్ఫుల్ లైఫ్ ను కొనసాగిస్తున్న మసాబా గుప్తా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె ఫైనల్ గా పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలం నుంచి మసాబా గుప్తా కు, సత్యదీప్ మిశ్రా కు మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వని మసాబా రహస్యంగా పెళ్లి చేసుకుని తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ప్రేమ, శాంతి, సంతోషం అన్నీ ఇక్కడే ఉన్నాయి. శాంతి స్వరూపుడైన సత్య దీప్ తో నా పెళ్లి జరగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి తగ్గట్టే వాళ్ళ పెళ్లి ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం వీళ్ళిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి ఫోటోలను చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపోతే పెళ్లి బట్టలో మసాబా చాలా అందంగా ఉంది. లైట్ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతుంది.

star beauty secret marriage

star beauty secret marriage

అయితే మసాబాకు ఇది రెండో పెళ్లి. సక్సెస్ఫుల్ డిజైనర్ గా కొనసాగుతున్న ఈమె నిర్మాత మధు మటేనా ను మొదట పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది కాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటుంది. అలాగే సత్యదీప్ మిశ్రా కు కూడా ఇది రెండో పెళ్లి. గతంలో హీరోయిన్ అతిధి రావుని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా 2013లో విడాకులు ఇచ్చేసాడు. కాగా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఈ క్రమంలోనే బాలీవుడ్లో వీళ్ల పెళ్లి పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి