Star Hero Daughter : అంద‌రి ముందు బాయ్‌ఫ్రెండ్‌తో అలా చేసిందేంటి.. స్టార్ హీరో కూతురు ప‌నిని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Hero Daughter : అంద‌రి ముందు బాయ్‌ఫ్రెండ్‌తో అలా చేసిందేంటి.. స్టార్ హీరో కూతురు ప‌నిని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2022,8:30 pm

Star Hero Daughter : ఈ మ‌ధ్య స్టార్ సెల‌బ్రిటీల కూతుళ్లు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌నీసం త‌మ గురించి ఎవ‌రు ఏమ‌నుకుంటారో కూడా ఆలోచించ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇటీవ‌లి కాలంలో చేస్తున్న రచ్చ‌పై నెటిజ‌న్స్ విరుచుకుప‌డుతున్నారు. అమీర్ ఖాన్ 3ఇడియట్స్‌’, ‘ధూమ్3’, ‘పీకే’, ‘దంగల్‌’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ విడుదలై ఫ్లాప్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. ఓ వైపు సినిమాల‌తో అమీర్ ఖాన్ వార్త‌ల‌లో నిలుస్తుంటే ఆయ‌న కూతురు ఐరా ఖాన్ ప్రేమాయ‌ణంతో హాట్ టాపిక్ అవుతుంది.

ఐరాఖాన్‌ ఫిట్‌నెస్ ట్రైనర్‌ నుపూర్‌ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు క ప్రకటించింది. గత కొంత కాలంగా ఇద్ద‌రు క‌లిసి క‌ట్టుగా ఉన్న తాజాగా తమ ప్రేమబంధాన్ని అఫిషియల్‌గా ప్రకటించింది. కాగా తాజాగా ఐరా ఖాన్‌ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో నుపుర్‌.. ఉంగరం తొడిగి ఐరాకు ప్రపోజ్‌ చేయగా.. ఐరా ఖాన్‌ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమీర్‌ఖాన్‌, తన మొదటి భార్య రీనాదత్తాకు ఐరా ఖాన్‌ జన్మించింది. ఇక త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా నేడు వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి నిశ్చితార్థం ఇండియన్ స్టయిల్ లో కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఘనంగా ఏమీ జరగలేదు.

Star Hero Daughter ira khan gets trolled

Star Hero Daughter ira khan gets trolled

 Star Hero Daughter : ఏంద‌మ్మ‌డు ఇలా..

ప్రస్తుతం ఈ జంట ఇటలీ వెకేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ సైక్లింగ్ ఈవెంట్లో ఐరా దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని అడగడంతో ఓకే చెప్పి మరి రింగ్ పెట్టించుకుంది ఐరా. అంతేనా ఆ తర్వాత అందరూ చూస్తుండగానే పబ్లిక్ లోనే ఘాటుగా ముద్దులు పెట్టుకొని షాక్ అయ్యేలా చేశారు. ఈ క్ర‌మంలో ఐరాని నువ్వు తండ్రిని మించి పోతావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇలా కుటుంబ సభ్యులకు దూరంగా అమీర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం జరిగింది. ఐరా ఖాన్ ఈ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నుపుర్, ఐరా ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో తమ సన్నిహిత ఫోటోలని షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది