
star hero helped to superstar krishna to marry vijaya nirmala
Superstar Krishna – Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజండ్. ఆయన చనిపోయి ఒక్క రోజు అయినా కూడా ఆయన అభిమానులు ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కూడా లేవు. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సూపర్ స్టార్ కృష్ణ.. సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టించిన నటుడు. ఆయన పేరు మీద ఉన్న రికార్డులు మరే హీరోకు లేవు. అది ఆయన సత్తా. అందుకే ఆయన ఒక లెజండ్ గా నిలిచిపోయారు. ఇక.. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు కృష్ణకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులో ఒకటి కృష్ణ, విజయనిర్మల పెళ్లి. ఎందుకంటే.. అప్పటికే పెళ్లి అయి పిల్లలను కన్న తర్వాత కృష్ణ.. విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. వాళ్ల పెళ్లి అంత ఈజీగా ఏం జరగలేదట. సినిమా స్టోరీని తలపించేలా వాళ్ల పెళ్లి విషయంలో చాలా ట్విస్టులు ఉన్నాయట. ఎందుకంటే.. విజయనిర్మలకు అప్పటికే కృష్ణమూర్తి అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఒక కొడుకు కూడా పుట్టాడు. అతడే నరేష్. అప్పటికీ విజయనిర్మల ఇంకా సినిమాల్లోకి రాలేదు. పెళ్లి తర్వాత సినిమాల్లోకి రావాలని విజయనిర్మల కలలు కన్నది. కానీ.. కృష్ణమూర్తికి అది నచ్చలేదు. విజయనిర్మల సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. అయినా కూడా ఆమె సినిమాల్లోకి వెళ్లారు. కృష్ణతో ఎక్కువ సినిమాలు చేయడంతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అది పెళ్లి వరకు వచ్చింది.
star hero helped to superstar krishna to marry vijaya nirmala
చంద్రమోహన్ మొదటి నుంచి విజయనిర్మలకు చాలా ఆప్తుడిగా ఉండేవారు. ఆయనే వీళ్ల పెళ్లికి సహకరించారు. చాలామంది సన్నిహితులే వాళ్ల పెళ్లికి మద్దతు ఇవ్వకున్నా.. చంద్రమోహన్ వాళ్ల పెళ్లికి సహకరించారు. చంద్రమోహన్ ను విజయనిర్మల దగ్గరికి మధ్యవర్తిత్వం కోసం పంపించారట. కృష్ణ తరుపున వెళ్లి చంద్రమోహన్ అడిగారట. దీంతో ఒకవేళ ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే నన్నే వచ్చి డైరెక్ట్ గా అడగమనండి అని చంద్రమోహన్ కు చెప్పిందట విజయనిర్మల. దీంతో కృష్ణ నేరుగా వెళ్లి విజయనిర్మలను అడిగారట. దీంతో విజయనిర్మల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. చంద్రమోహన్ మళ్లీ దగ్గరుండి వాళ్ల పెళ్లిని సీక్రెట్ గా జరిపించారట. తిరుపతిలో స్వామి వారి సన్నిధిలో కృష్ణ, విజయనిర్మల పెళ్లి జరిగింది. ఈ విషయం తన మొదటి భార్య ఇందిరా దేవికి ముందే చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.