Star Hero : పెళ్ళాం ఉండగా పాతికేళ్ళ అమ్మాయిని ఉంచుకున్న యాభైయేళ్ల స్టార్ హీరో – అడ్డంగా దొరికాడు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Hero : పెళ్ళాం ఉండగా పాతికేళ్ళ అమ్మాయిని ఉంచుకున్న యాభైయేళ్ల స్టార్ హీరో – అడ్డంగా దొరికాడు !

 Authored By sandeep | The Telugu News | Updated on :23 December 2022,10:00 pm

Star Hero : ఇటీవ‌ల సినీ సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రేమ‌, పెళ్లి, డేటింగ్ ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. అయితే సినీ జీవితంలో మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా లియోనార్డో డికాప్రియో ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంది. లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో హాలీవుడ్ నటుడు, నిర్మాత కాగా, టైటానిక్ సినిమాతో భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్నాడు. ఇక‌ పీరియడ్ చిత్రాల్లో తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో అశేష ప్రేక్ష‌కాదార‌ణ పొందాడు. వెండి తెరపై బాయ్స్ లైఫ్ సినిమాతో నటుడిగా అడుగు పెట్టి..

వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ సినిమాతో నటించిన పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే సినీ జీవితంలో మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా లియోనార్డో డికాప్రియో ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన కంటే పాతికేళ్ల చిన్న వయసు ఉన్న విక్టోరియా లామాస్ అనే మోడల్ తో మ‌నోడు ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. విక్టోరియా లామాస్ `ఫాల్కన్ క్రెస్ట్` నటుడు లోరెంజో లామాస్ కుమార్తె అయిన ఈ యువ న‌టి ఇటీవ‌ల లియోనార్డోతో ఓ పార్టీలో కనిపించింది.దీంతో వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది.

Star Hero leonardo dicaprio and actress victoria lamas news viral

Star Hero leonardo dicaprio and actress victoria lamas news viral

Star Hero : ఏంద‌య్యా .. ఈ ప‌ని

ఇద్ద‌రిపై జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వారి స‌న్నిహితులు… ఈ జంట డేటింగ్ చేయడం లేదు. ఇద్దరూ పెద్ద గ్రూప్ డిన్నర్ లో వరుసలో కూర్చున్నారు. చేరువలో కూర్చోలేదు అని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం.. లియోనార్డో .. ‘కెమిల్లా మోరోన్’ తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండ‌గా, అనుకోని కార‌ణాల వ‌ల‌న విడిపోవ‌ల్సి వ‌చ్చింది. ఇక లియోనార్డో ఎప్పుడూ ప్రేమ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు 25 ఏళ్ళు దాటిన అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్ర‌చారం సాగడంతో లియోనార్డో పేరు మారు మ్రోగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది