Heroine Laya : ” నువ్ నా ప్రాణం” అని హీరోయిన్ లయ చెప్పినా ఛీ కొట్టిన టాప్ హీరో ఎవరు?
Heroine Laya : చాలామంది హీరోయిన్లు ఎంతో హడావుడి చేస్తారు. స్క్రీన్ మీద అంతే.. బయట కూడా అంతే. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని రచ్చ చేస్తారు. ఫోటోషూట్స్ పేరుతో గ్లామర్ షోకే తెర లేపుతారు. కానీ.. కొందరు హీరోయిన్స్ ఉంటారు. అసలు వాళ్లు గ్లామర్ అంటేనే పట్టించుకోరు. చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. ఏమాత్రం కూడా అందాలు ఆరబోయరు. అచ్చ తెలుగు ఆడపిల్లలా చీరకట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు. అప్పట్లో అయితే ఒక సౌందర్య, ఒక మీనా, స్నేహా.. అలా వేళ్ల మీద పేర్లు లెక్కించొచ్చు. అదే కేటగిరీకి చెందిన హీరోయిన్లలో లయ కూడా ఉంది.
అవును.. లయ గురించి తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా హోమ్లీగా ఉంటుంది. తెలుగులో తను 50కి పైనే సినిమాల్లో నటించింది. నిజానికి తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. స్వయంవరం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఇండస్ట్రీలో తను స్టార్ హీరోయిన్ అయింది. తనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఓ ఐదారేళ్ల పాటు తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. 2006 లో లయ పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో సినిమాలకు దూరం అయింది.
Heroine Laya : వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో స్టార్ హీరోయిన్ రేంజ్
ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన లయ ఇటీవల ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడే తన మనసులో మాటను బయటపెట్టింది. తను హీరోయిన్ గా ఉన్న సమయంలో తనతో నటించిన ఓ స్టార్ హీరో తనను ప్రేమించాడట. తన ప్రేమలో పడ్డాడట. అతడు స్టార్ హీరో అని.. ఇద్దరూ కలిసి ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించారట. కానీ.. అతడు లయకు ఆ విషయం చెప్పడానికి చాలా భయపడేవాడట. కానీ.. లయకు మాత్రం అతడు తనను ప్రేమిస్తున్నాడనే విషయం తెలిసిపోయిందట. దీంతో తను కూడా ఏం తెలియనట్టుగా ఉందట. చివరకు ఆ హీరో తనకు ప్రపోజ్ మాత్రం చేయకుండానే అలాగే ఆ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం లయ రివీల్ చేయలేదు.