Tamannaah Bhatia : నా మొగుడి జోలికి వస్తే ఊరుకోను ..తమన్నా కి స్టార్ హీరో భార్య స్ట్రాంగ్ వార్నింగ్ !?

Advertisement

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు పరిశ్రమలోకి ‘ హ్యాపీడేస్ ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించింది. ఇక పరిశ్రమలో ఎఫైర్స్ అనేవి చాలా కామన్. వరుసగా ఓ హీరో హీరోయిన్ రెండు సినిమాలు చేస్తే చాలు అనుమానాలు మొదలైపోతాయి. షూటింగ్ టైంలో వారు క్లోజ్ గా ఉన్న వారిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు రాసేస్తారు. అయితే గతంలో తమన్నా మీద కూడా ఇలాంటి వార్తలు రాశారు. 2011లో అల్లు అర్జున్ తమన్నా కాంబినేషన్లో ‘ బద్రీనాథ్ ‘ సినిమా తెరకెక్కింది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నారు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయితే బద్రీనాథ్ షూటింగ్ సెట్స్ కి స్నేహ రెడ్డి వెళ్లేవారట. అప్పుడు స్నేహారెడ్డికి సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా తెలియదు. అల్లు అర్జున్ తో తమన్నా రొమాన్స్ చేస్తుంటే స్నేహ రెడ్డి తట్టుకోలేకపోయేవారట. అప్పట్లో తమన్నా పట్ల స్నేహ రెడ్డి తీరు సెట్స్ లో చర్చకు దారి తీసిందట. అయితే తర్వాత స్నేహ రెడ్డికి ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలిసిందట. సీన్ సహజంగా వచ్చేందుకు, ప్రేక్షకులను మెప్పించేందుకు హీరోయిన్స్ హీరోలతో రొమాన్స్ చేస్తారని అర్థమైందట.

Advertisement
Star hero wife About Tamannah Bhatia in movie shooting
Star hero wife About Tamannah Bhatia in movie shooting

అప్పటినుంచి ఆమె బన్నీతో నటించే హీరోయిన్స్ ను తప్పుగా భావించడం మానేశారట. ఇక తమన్నాకు ఇదే అనుభవం రామ్ చరణ్, ఎన్టీఆర్ భార్యలతో కూడా వచ్చిందని వాదన ఉంది. ఇకపోతే తమన్నా టాలీవుడ్ కి వచ్చి దశాబ్దానికి పైగా అవుతుంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికి చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేశారు. అయితే బాలీవుడ్ నటుడు విజయ వర్మను తమన్నా ప్రేమిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎప్పటి నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్లుగా డేటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement