Jr NTR : హీరోయిన్ అయిన ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలతో నటించాలనే డ్రీం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది స్టార్స్ తో నటిస్తే వారికి చెప్పలేనంత సంతృప్తి ఉంటుంది. కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేష్ అలాంటి తన విష్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్యనే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ అందుకుంది.తమిళ్ లో సినిమాలు చేసి అక్కడ బాగానే పాపులారిటీ సంపాదించిన అమ్మడు తెలుగులో మాత్రం సరైన క్రేజ్ తెచ్చుకోలేదు. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసినా లాభం లేకుండా పోయాయి. నానితో టక్ జగదీష్ ఎందుకు చేసిందో ఆమెకు కూడా తెలుసో లేదో తెలియదు.
ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో ఆమె ప్రేక్షకుల మనసులు గెలిచింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు తెలుగులో మంచి ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. ఐతే తనకు మాత్రం ఎన్టీఆర్ తో నటించాలని ఉందని అసలు విషయాన్ని చెప్పింది అమ్మడు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని అది నెరవేరితే మాతం తనకన్నా సంతోషించే వారు ఇంకెవరు ఉండరని అంటుంది.
ఎన్టీఆర్ Jr Ntr కూడా హీరోయిన్ పాత్రకు సూట్ అయితే చాలు వారి ముందు సినిమాల గురించి పెద్దగా పట్టించుకోడు సో ఐశ్వర్య కోరిక బలంగా ఉంటే మాత్రం తప్పకుండా Jr ntr ఎన్టీఆర్ తో జత కట్టే ఛాన్స్ లేకపోలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో అయితే ఎన్టీఆర్ కి ఐశ్వర్య పర్ఫెక్ట్ పెయిర్ గా ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా తారక్ పై తన ప్రేమను బయట పెట్టిన ఐశ్వర్య తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుతుంది. అంతేకాదు తాను గ్లామర్ రోల్స్ చేయనని అందరు అనుకుంటారు కానీ పాత్ర కన్విన్స్ అయ్యేలా ఉంటే గ్లామర్ షోకి తాను రెడీ అని అంటుంది అమ్మడు. ఏది ఏమైనా ఐశ్వర్య కి మంచి ఛాన్స్ వస్తే ఆమె ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పొచ్చు. NTR, Aishwarya Rajesh, Tarak, Star Hero, Sankranthiki Vastunnam, Nani
Rashmika Mandanna : నేషనల్ క్రష్ అన్న పదానికి న్యయం చేస్తూ తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో…
PMAY : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన Pradhan Mantri Awas Yojana (అర్బన్) 2.0 కింద 20 లక్షల…
Vijayasai Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Ysrcp ( వైఎస్ఆర్సీపీ ) జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి…
Creta Electric Car : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV -…
Free Sewing Machine : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) కింద క్రైస్తవ మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు…
IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో…
Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2 పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న…
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…
This website uses cookies.