IT Raides : నెక్స్ట్ టార్గెట్ ఆ ముగ్గురు హీరోలే.. ఐటీ రైడ్స్ ఛాన్స్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IT Raides : నెక్స్ట్ టార్గెట్ ఆ ముగ్గురు హీరోలే.. ఐటీ రైడ్స్ ఛాన్స్..?

 Authored By ramesh | The Telugu News | Updated on :24 January 2025,5:59 pm

ప్రధానాంశాలు:

  •  IT Raides : నెక్స్ట్ టార్గెట్ ఆ ముగ్గురు హీరోలే.. ఐటీ రైడ్స్ ఛాన్స్..?

IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో పాటుగా దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ లు, మ్యాంగో రాం ఆఫీస్, ఇల్లలో ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ రైడ్స్ లో కీలక డాక్యుమెంట్స్ కొన్ని దక్కించుకున్నారని తెలుస్తుంది. మొత్తం 50 మంది టీం డివైడ్ అయ్యి ఐటీ రైడ్స్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈమధ్య రిలీజైన సినిమాల్లో వందల కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్స్ వేశారు. ఐతే వాటిపై అధికారిక లెక్కలు చూడాలని ఐటీ అధికారులు నిర్మాతల ఇల్లపై ఆఫీసులపై సోదాకి దిగారు. సుకుమార్ ఇల్లు, ఆఫీస్ లపై కూడా ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలిసిందే. ఐతే ఐటీ అధికారులు నెక్స్ట్ ముగ్గురు స్టార్ హీరోల మీద కూడా రైడ్స్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

IT Raides నెక్స్ట్ టార్గెట్ ఆ ముగ్గురు హీరోలే ఐటీ రైడ్స్ ఛాన్స్

IT Raides : నెక్స్ట్ టార్గెట్ ఆ ముగ్గురు హీరోలే.. ఐటీ రైడ్స్ ఛాన్స్..?

IT Raides : ఒక్కో సినిమాకు 150 కోట్ల దాకా..

పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ వందల కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న హీరోలను ఐటీ అధికారులు టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో Prabhas  ప్రభాస్, Jr Ntr ఎన్టీఆర్, అల్లు అర్జున్ Allu arjun  ఉన్నారని సమాచారం వస్తుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల దాకా తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం దాదాపు 300 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్టు టాక్.

ఎన్ టీ ఆర్ కూడా సినిమాకు 100 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇలా ఈ ముగ్గురు హీరోల ఆదాయపు పన్ను లెక్కలు చూసేందుకు ఐటీ అధికారులు సిద్ధం అవుతున్నారని. నిర్మాతల ఇల్ల మీద, ఆఫీస్ ల మీద ఐటీ రైడ్స్ ముగిసిన తర్వాత ఈ హీరోలను టార్గెట్ చేసుకుని రైడ్స్ జరుగుతాయని సమాచారం. మరి ఇందులో ఏమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఐతే ఐటీ రైడ్స్ అనగానే సినీ సెలబ్రిటీస్ అంతా వణికిపోతుంటారు. కొందరు స్టార్స్ మాత్రం తాము ఎంత తీసుకున్నా ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా కడుతున్న కారణంగా వారి మీద ఎలాంటి సోదాలు నిర్వహించాల్సిన ఛాన్స్ లేదని తెలుస్తుంది. IT Raides, Three Heroes, NTR, Allu Arjun, Prabhas

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది