Tollywood Actors : కొత్త హీరోలతో రొమాన్స్‌ లిప్ లాక్‌ కు ఓకే అంటే ముద్దుగుమ్మలకు కోట్లకు కోట్లే

 Authored By prabhas | The Telugu News | Updated on :19 January 2022,6:00 pm

Tollywood Actors : టాలీవుడ్‌ హీరోయిన్స్ పారితోషికంను భారీగా పెంచారు. ఒకప్పుడు 50 లక్షల పారితోషికం అంటే చాలా గొప్ప విషయం. హీరోలు పది కోట్లకు పైగా తీసుకునే సమయంలో కూడా హీరోయిన్స్ పారితోషికం కేవలం అర కోటి మాత్రమే.. అదే అప్పట్లో అత్యధికం. ఆ భారీ పారితోషికం ఇప్పుడు నాలుగు అయిదు కోట్లకు పెరిగింది. బాలీవుడ్‌ హీరోయిన్స్ అయితే ఏకంగా పాతిక కోట్లు కూడా తీసుకుంటూ రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇక సౌత్‌ లో నయనతార తో పాటు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ నాలుగు నుండి అయిదు కోట్ల రూపాయలను దక్కించుకుంటూ ఉన్నారు. వీరికి దక్కే పారితోషికం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పెద్ద హీరోల సినిమాలకు హీరోయిన్ పారితోషికం టాపిక్ కాదు కాని చిన్న హీరోల సినిమాలో నటించే పెద్ద హీరోయిన్స్ పారితోషికం ఎప్పుడు కూడా హాట్‌ టాపిక్‌.

తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన రెండు చిన్న చిత్రాల్లో పెద్ద హీరోయిన్స్ నటించడం జరిగింది. గల్లా అశోక్‌ హీరోగా నటించిన హీరో సినిమా లో నిధి అగర్వాల్‌ కనిపించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో హీరోయిన్ గా నటించినందుకు గాను నిధి అగర్వాల్‌ కు ఏకంగా కోటికి పైగా పారితోషికం దక్కిందట. ఆమె పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోతో నటించడం తో పాటు ఆమెకు తమిళంలో అత్యధిక క్రేజ్ ఉంది. అందుకే ఆమెను ఈ సినిమా లో నటింపజేసేందుకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పారితోషికం విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.హీరో సినిమా లో నటించినందుకు గాను నిధి కి కోటి పారితోషికం దక్కింది.

star heroines get big remuneration for new heros movies

star heroines get big remuneration for new heros movies

Tollywood Actors : లిప్‌ లాక్ కు 50 లక్షలు అదనంగానా..!

అయితే దిల్‌ రాజు వారసుడు అశ్విన్‌ నటించిన సినిమా రౌడీ బాయ్స్ సినిమా లో అనుపమ పరమేశ్వరన్‌ నటించినందుకు గాను ఏకంగా కోటిన్నర రూపాయలను పారితోషికంగా దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయి పారితోషికం ఇవ్వడంకు ప్రథాన కారణం హీరో తో అనుపమ పరమేశ్వరన్‌ రొమాంటిక్ సన్నివేశాలు మరియు లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అందుకే ఈ సినిమా కు గాను ఆమెకు ఇంత పారితోషికం అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం ముద్దు సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలకు కోట్ల పారితోషికం ఇవ్వడం ఏంటో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ సన్ని వేశాలు లేకుంటే పాతిక లక్షలు కూడా వారికి ఇచ్చే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి