TollyWood Heroines : అప్పుడు అడుక్కుతినే పొజిషన్.. ఇప్పుడు ఏకంగా కోట్లకు పడగలెత్తిన టాలీవుడ్ హీరోయిన్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TollyWood Heroines : అప్పుడు అడుక్కుతినే పొజిషన్.. ఇప్పుడు ఏకంగా కోట్లకు పడగలెత్తిన టాలీవుడ్ హీరోయిన్స్!

TollyWood Heroines : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బంగారు గని.. అందులో ఎవరికి తోచినంత వారు తవ్వుకోవచ్చు.కానీ అలా తవ్వుకోవాలంటే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారికి తోచినంత డబ్బులు వెనకేసుకోవచ్చు. ఈ ఒక్క లాజిక్ తెలుసుకున్న హీరోయిన్స్ ఇప్పుడు అలాగే ఏకంగా కోట్లకు పడగలెత్తారు.తమ కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని.. డౌన్ టు ఎర్త్ తమ ప్రయాణం సాగిందని పలు సందర్భాల్లో ఈ హీరోయిన్స్ పేర్కొన్నారు. TollyWood […]

 Authored By mallesh | The Telugu News | Updated on :3 September 2022,5:30 pm

TollyWood Heroines : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బంగారు గని.. అందులో ఎవరికి తోచినంత వారు తవ్వుకోవచ్చు.కానీ అలా తవ్వుకోవాలంటే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారికి తోచినంత డబ్బులు వెనకేసుకోవచ్చు. ఈ ఒక్క లాజిక్ తెలుసుకున్న హీరోయిన్స్ ఇప్పుడు అలాగే ఏకంగా కోట్లకు పడగలెత్తారు.తమ కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని.. డౌన్ టు ఎర్త్ తమ ప్రయాణం సాగిందని పలు సందర్భాల్లో ఈ హీరోయిన్స్ పేర్కొన్నారు.

TollyWood Heroines : టాలెంట్‌తో పాటే అదృష్టం తోడుంది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు. కొందరు ఎంత వేగంగా వస్తారో అంతే వేగంగా వెళ్లిపోతారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్స్ అంతా పక్క రాష్ట్రాలకు చెందిన వారే. తెలుగు హీరోయిన్లు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే వారు అందాలను ఆరబోసేందుకు వెనకడుగేస్తారు. అందువల్లే వారికి అవకాశాలు ఎక్కువగా రావు. ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా గురించి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చి నేటికి అవకాశాలు పొందుతోంది. ఈమెకు పెద్దగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఈ నటి సినిమాల్లోకి వచ్చినప్పుడు మిడిల్ క్లాస్..ఇప్పుడు తమన్నాకు ముంబైలో రెండు ఇళ్లులు.. హైదరాబాద్‌లో ఫ్లాట్స్.

tollywood heroines who have reached crores

tollywood heroines who have reached crores

పలు బిజినెస్‌లలో పెట్టుబడులు ఉన్నాయి. అలాగే నయన్ విషయానికొస్తే తొలినాళ్లలో పది రూపాయలు లేవని చెప్పింది. ఇప్పుడు తెలుగు, తమిళ్లో టాప్ హీరో్యిన్. కోట్ల ఆస్తులును సంపాదించుకుంది. సమంత..ఈ బ్యూటీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక సినిమాల్లోకి వరుస అవకాశాలతో సామ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. చైతూ నుంచి విడాకులు తీసుకున్నాక భరణం కింద డబ్బులు వచ్చాయని కొందరు రాలేదని మరికొందరు అంటున్నారు.ఇక సామ్ కూడా తన కష్టంతో బానే సంపాదించింది.ఆమె పేరిట కోట్ల ఆస్తులు, ప్లాటు, బిల్డింగులు ఉన్నాయి. కన్నడ బ్యూటీ రష్మిక..అందరికంటే ఈ బ్యూటీ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిందని టాక్. కోట్ల ఆస్తులు, ముంబైలో కొత్త ఇళ్లు, ప్రాపర్టీలు, త్వరలోనే బిజినెస్‌లోకి ఎంటర్ అవుదామని చూస్తోందట..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది