Comedy Stars Show : కామెడీ స్టార్స్‌ గాడిలో పడ్డట్లేనా.. రేటింగ్ ఎలా ఉంది?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 10, 2022, 1:00 pm

Comedy Stars Show : ఈటీవీ జబర్దస్త్‌ కు పోటీ అన్నట్లుగా మొదలు అయిన స్టార్ మా ఛానల్ యొక్క కామెడీ స్టార్స్ కు మొదట ఏమాత్రం రేటింగ్‌ దక్కలేదు. ఒక వైపు జబర్దస్త్‌ ప్రాభవం కోల్పోతుంది. మరో వైపు జనాలు పెద్దగా జబర్దస్త్ ను ఆధరించడం లేదు. దాంతో మెల్ల మెల్ల గా తమ షో యొక్క ఆధరణ పెరుగుతుండటంతో స్టార్‌ మా డోస్ పెంచుతున్నట్లుగా కామెడీ మోతాదు పెంచుతున్నారు. నాగబాబు మరియు శేఖర్ మాస్టర్ లు జడ్జ్ లుగా సందడి చేస్తున్నారు. జబర్దస్త్‌ నుండి వెళ్లి పోయిన కమెడియన్స్ అక్కడ హడావుడి చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో కూడా స్టార్‌ మా లో టెలికాస్ట్‌ అవుతున్న కామెడీ స్టార్స్ గురించి చాలా పాజిటివ్‌ గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆధరణ పెరుగుతోంది. గత రెండు వారాలుగా రేటింగ్ కాస్త మెరుగు పడినట్లుగా తెలుస్తోంది. ఆ మద్య షో నిర్వాహకులకు స్టార్‌ మా వారు ఆరు వారాల సమయం ఇచ్చి అప్పటి వరకు రేటింగ్‌ పెరగకుంటే ఖచ్చితంగా షో ను నిలిపి వేయాల్సి ఉంటుందని హెచ్చరించారట. దాంతో షో పై చాలా స్పెషల్‌ కేర్ తీసుకుని మరీ యూనిట్ సభ్యులు ప్లాన్‌ చేశారట.

star maa tv Comedy Stars Show gets good rating

star maa tv Comedy Stars Show gets good rating

తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్‌ రేంజ్ కామెడీ షో మళ్లీ ఎప్పటికి రాదు అనుకుంటూ ఉండగా స్టార్‌ మా లో కామెడీ స్టార్స్ వస్తుందని ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. జబర్దస్త్‌ నుండి ఆది, సుధీర్ మరియు గెటప్ శ్రీనులు వెళ్లి పోవడంతో పాటు ఇంకా పలువురు కమెడియన్స్ కూడా పక్క ఛానల్స్ వైపు తిరిగి చూస్తున్నారు. అందుకే ఆ షో కు సంబంధించిన రేటింగ్‌ తగ్గుతుంది. ఇదే సమయంలో స్టార్‌ మా యొక్క రేటింగ్‌ పెరుగుతుందని కామెంట్స్ వస్తున్నాయి. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన జబర్దస్త్‌ రేంజ్ లో కాకున్నా ఖచ్చితగా స్టార్‌ మా ఒక మోస్తరుగా అయినా గాడిలో పడినట్లే అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp