Home » Entertainment » Star Maa Tv Totally Stopped Comedy Stars Show
Entertainment

Comedy Stars Show : స్టార్ మా లో ఇక కామెడీ స్టార్స్ లేనట్లేనా? వారందరూ పరిస్థితి ఏంటి?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 4, 2022, 7:00 pm
Advertisement

Comedy Stars Show : జబర్దస్త్ నుండి చాలా మంది కమెడియన్స్ ఎక్కువ పారితోషకం ఆశ చూపించడం తో స్టార్ మా కి వెళ్ళి పోయిన విషయం తెలిసింది. అక్కడ కామెడీ స్టార్స్‌ కార్యక్రమం ని ఓంకార్ మొదలు పెట్టాడు. కామెడీ స్టార్స్ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ ఎంతో మంది పాల్గొని మంచి పేరు ను దక్కించుకుని.. మరింతగా గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే కార్యక్రమాన్ని సరిగా నిర్వహించక పోవడం తో పెద్దగా లాభాలు తెచ్చి పెట్టలేదు. స్టార్ మా వారు లాభాలు లేని కార్యక్రమాలను అస్సలు ప్రోత్సహించరు అనే విషయం మరో సారి నిరూపితమైంది. సుడిగాలి సుదీర్ ని కూడా స్టార్ మా వారు కేవలం పోటీకి అన్నట్లుగానే తీసుకున్నారు.

Advertisement

కామెడీ స్టార్స్ కోసమే ఈ టీవీ నుండి చాలా మంది కమెడియన్స్‌ ని లాగేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కామెడీ స్టార్స్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాక పోవడంతో ఈ భారాన్ని తాము మోయలేం అన్నట్లుగా వదిలించుకునే ప్రయత్నం చేశారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమం ఇక రాదని జబర్దస్త్ నుండి వెళ్లి పోయి స్టార్ మా పై నమ్మకం పెట్టుకున్న వారందరి పరిస్థితి ఇక అగమ్య గోచరం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఓంకార్ సూచన మేరకు ఆహా ఓటీటీ వారు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే పేరు తో సుడిగాలి సుదీర్, అనిల్ రావిపూడి ఆధ్వర్యంలో ఒక భారీ కామెడీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

star maa tv totally stopped Comedy Stars Show

Advertisement

అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ కార్యక్రమం హిట్ అయితే జబర్దస్త్ తరహా లో కంటిన్యూగా షో ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కనుక సక్సెస్ అయితే జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారందరూ అక్కడికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా ఫ్లాప్ అయితే ఈటీవీ మల్లెమాలను వదిలేసి పోయిన వాళ్లంతా తల పట్టుకునే అవకాశం ఉందని బుల్లి తర్వాత మాట్లాడుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి