Shanmukh : బిగ్ బ్రేకింగ్.. గంజాయితో పట్టుబడిన స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్...!
Shanmukh : బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట యూట్యూబ్ లో పలు రకాల వెబ్ సిరీస్ చేస్తూ మంచి గుర్తింపు సాధించిన షణ్ముఖ్ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యారు. ఇక అతను బిగ్ బాస్ లో ఉన్న సమయంలోనే తన ప్రేయసి దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు చాలామంది ఫిదా కూడా అయ్యారు. అయితే ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్లిద్దరు విడిపోవడం జరిగింది. అప్పటినుండి వీరిద్దరిపై సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా షణ్ముఖ్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే గతంలో ఒక కార్ యాక్సిడెంట్ వలన షణ్ముఖ్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా షణ్ముఖ్ మరో కేసులో ఇరుక్కున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా షణ్ముఖ్ తన ఇంట్లో గంజాయి కొడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే ఓ యువత ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అతని ఫ్లాట్ కు వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ గంజాయి కొడుకు కనిపించాడట. దీంతో సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ని కూడా నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితమే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత సంపత్ వినయ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు.
ఇక 20 రోజుల క్రితమే వేరే యూవతి ని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించి తనను నమ్మించి మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ వినయ్ ను అదుపులోకి తీసుకునేందుకు , షణ్ముఖ్ నివాసానికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. ఇక ఆ సమయం లో షణ్ముఖ్ వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ నివాసానికి ఫిర్యాదు చేసిన యువతితో కలిసి పోలీసులు వెళ్లగా సదరు యువతీపై షణ్ముఖ్ సోదరుడు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారిద్దరిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.