Naresh : నరేష్ రెండవ భార్య విషయంలో ప్రపంచానికి తెలియని అతిపెద్ద సీక్రెట్ ఇదే..!

 Authored By kranthi | The Telugu News | Updated on :11 January 2023,8:20 pm

Naresh : టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం మీద వచ్చినన్ని గాసిప్స్ మరే నటుడి జీవితం మీద రాలేదు. దానికి కారణం.. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత తన సహచర నటి పవిత్ర లోకేశ్ తో సహజీవనం చేయడం. ఇప్పుడు కాదు.. గత సంవత్సరం నుంచే నరేశ్ వ్యక్తిగత జీవితం మీడియాపాలు అయింది. ఎవరు చూసినా ఆయన, పవిత్ర గురించే చర్చించడం. అలాగే.. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేయడం చూశాం. ఇదంతా పక్కన పెడితే.. అసలు ఆయనకు మూడు పెళ్లిళ్లు ఎందుకు అయ్యాయి. ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారా?

ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు.. అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. నరేశ్ కు తన 19 ఏళ్ల వయసులోనే మొదటి పెళ్లి జరిగింది. తనకు పెళ్లయిన కొన్నేళ్లకే ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆయన భార్య చనిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు నరేశ్. తన రెండో భార్య ఎవరో కాదు.. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ. విజయనిర్మల, రేఖా సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మ దగ్గరి సన్నిహితులు కావడంతో ఈ పెళ్లి చేశారు. అయితే.. వీళ్లకు పుట్టిన బిడ్డ తేజకు ఆటిజం అనే జబ్బు ఉంది.

story behind tollywood actor naresh second wfe

story behind tollywood actor naresh second wfe

Naresh : తన కొడుకును పట్టించుకోలేదని నరేష్ తో గొడవ పెట్టుకున్న రేఖా సుప్రియ

అయితే.. నరేశ్ కెరీర్ అదే సమయంలో పీక్స్ లో ఉంది. సినిమాల బిజీలో పడి.. తన కొడుకు తేజను పట్టించుకోలేదు. దీంతో రేఖా సుప్రియ.. నరేశ్ తో గొడవ పెట్టుకుంది. అది పెద్దదయింది. దీంతో ఇద్దరూ విడిపోయారు. తన కొడుకులా ఇంకో వ్యక్తి బాధపడకూడదని.. ఆటిజం సమస్యతో బాధపడుతున్న చాలామంది చిన్నారులను దత్తత తీసుకొని వాళ్ల ఆలనా పాలనా చూస్తోంది రేఖా సుప్రియ. కేవలం.. నరేశ్ ఫ్యామిలీకి సమయం కేటాయించడం లేదని.. ఆమె ఆయనకు విడాకులు ఇచ్చింది.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి