Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడేంటి.. ఈ వారం ఆమె ఎలిమినేట్ ప‌క్కా..!

Authored By Sam C | The Telugu News | Published on: October 16, 2022, 5:30 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ షో ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఆది వారం వ‌స్తే ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అయితే దాని క‌న్నా ముందు ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాలు మాత్రం చాలానే జ‌రుగుతుంటాయి. సీజ‌న్ 6లో ఆరవ వారం మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, మరీనా, సుదీప, శ్రీ సత్య, కీర్తి భట్, బాలదిత్య, రాజ్, గీతూ ఉన్నారు. అయితే అందరూ టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో 6వ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో ఉన్న వారిలో శ్రీహాన్ అత్యధికంగా 20 శాతం ఓట్లు సంపాదించుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఆది రెడ్డి 13 శాతం, మరీనా 11 శాతం, శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్, గీతూ 10 శాతం మేర ఓట్లు రాబట్టుకొన్నారు. అయితే అతి తక్కువగా సుదీప 9.5 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. దాంతో సుదీప డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. ఈమె వంట‌గ‌దికే ఎక్కువ‌గా ప‌రిమితం కావ‌డం వ‌ల‌న గేమ్ లో ఆడిన‌ట్టే జ‌నాల‌కు క‌నిపించ‌డం లేదు. సుదీప ఇంటి స‌భ్యుల‌తో పాటు నాగార్జున కూడా ఈ విష‌యంలో ప‌దే ప‌దే హెచ్చ‌రించారు.

sudeepa eliminated from Bigg Boss 6 Telugu

sudeepa eliminated from Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : పాపం పింకీ..

అయిన‌ప్ప‌టికీ ఈమె పంథా మార్చుకోక‌పోవ‌డంతో ఈ వారం ఎలిమినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. శనివారం సాయంత్రం ముగిసిన ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ అనంతరం సుదీపను ఇంటి నుంచి హోటల్‌కు తరలించే ఏర్పాట్లు చేశారనేది విశ్వసనీయ సమాచారం. శ‌ని ఆది వారాలు వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ లో సందడితోపాటు కొంతమేర ఆందోళన కూడా ఉంటుంది. వారంలో కంటెస్టెంట్లందరూ చేసిన చేష్టాలు, పనులపై హోస్ట్ నాగార్జున వచ్చిన రివ్యూ చేస్తాడు. బాగా పర్ఫామ్ చేసినవాళ్లను మెచ్చుకుంటే బాగా ఆడని సభ్యులకు మొట్టికాయలు వేస్తాడు. శన‌వారం రోజు కొంద‌రికి మొట్టికాయ‌లు వేసిన నాగ్ వారితో స‌ర‌దాగా గేమ్స్ కూడా ఆడించాడు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp