Sudheer : తిని కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు!.. రష్మీ దీపిక పిల్లి పరువుతీసిన సుధీర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudheer : తిని కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు!.. రష్మీ దీపిక పిల్లి పరువుతీసిన సుధీర్ ఆది

Sudheer : రష్మి, దీపిక పిల్లి ఇద్దరూ కూడా ఢీ షోలో ఇప్పుడు బాగానే క్లోజ్ అయ్యారు. అక్కా చెల్లెళ్లుగా చాలా సన్నిహితంగానే ఉంటున్నారు. తెరపైనే కాకుండా తెర వెనుకా ఇద్దరూ బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు. మరీ ముఖ్యంగా దీపిక అయితే రష్మీ ఇంట్లో కూడా ఉంటోంది. అక్కా అంటూ రష్మీ చేసే మంచి పనులను కీర్తిస్తుంటుంది. ఇక తెరపై దీపకిపిల్లిని ఆది, సుధీర్ ఎలా ఆడుకుంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆది, సుధీర్ ఇద్దరూ కూడా […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 September 2021,1:40 pm

Sudheer : రష్మి, దీపిక పిల్లి ఇద్దరూ కూడా ఢీ షోలో ఇప్పుడు బాగానే క్లోజ్ అయ్యారు. అక్కా చెల్లెళ్లుగా చాలా సన్నిహితంగానే ఉంటున్నారు. తెరపైనే కాకుండా తెర వెనుకా ఇద్దరూ బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు. మరీ ముఖ్యంగా దీపిక అయితే రష్మీ ఇంట్లో కూడా ఉంటోంది. అక్కా అంటూ రష్మీ చేసే మంచి పనులను కీర్తిస్తుంటుంది. ఇక తెరపై దీపకిపిల్లిని ఆది, సుధీర్ ఎలా ఆడుకుంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆది, సుధీర్ ఇద్దరూ కూడా రష్మీ, దీపిక పరువు తీసేశాడు.

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

వచ్చే వారానికి సంబంధించిన ఢీ షో ప్రోమో వచ్చింది. ఇందులో ఆది, సుధీర్‌లను దీపిక, రష్మీలు ఇమిటేట్ చేశారు. అచ్చం వారిలానే నటించారు. ఆది, సుధీర్ ఎలాఎంట్రీ ఇస్తారో చేసి చూపించారు. ఇక ఆది అయితే ప్రియా అంటూ ప్రియమణిని ఫ్లర్ట్ చేసే విధానాన్ని దీపిక పిల్లి చేసి చూపించింది. సుధీర్ పూర్ణను ఎలా ఫ్లర్ట్ చేస్తాడు.. ఆమె ముందు ఎలా నటిస్తాడో కూడా రష్మీ చూపించింది. సుధీర్ ఎలా సిగ్గుపడతాడు.. ఎలా మాట్లాడతాడో అచ్చం రష్మీ కూడా అలానే చేసింది.

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

తిని కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు!.. రష్మీ దీపిక పిల్లి పరువుతీసిన సుధీర్ ఆది
అలా సుధీర్, ఆదిని ఇద్దరూ కూడా బాగానే ఏడిపించారు. అయితే ఆ తరువాత ఆది సుధీర్ ఇద్దరూ కూడా రష్మి, దీపికల నటించేశారు. తినడం కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు అని దీపిక గురించి చెబుతూ ఆది నటించేశాడు. ఇన్నేళ్లు ఎలా ఉన్నావ్ అక్కా అంటూ రష్మీ పాత్రను చేస్తున్న సుధీర్‌ను ఆది అడిగేశాడు. నేను మాత్రం ఏం చేస్తాను.. తినడం కూర్చోడమే చేస్తున్నాను అంటూ రష్మీ, దీపికల పరువు తీసేశారు ఆది సుధీర్. నేను బాగా లేకపోయినా కూడా నువ్ నన్ను ప్రేమిస్తావ్.. సుధీర్ ఎంత మంచోడు అని రష్మీ క్యారెక్టర్‌లో ఉన్న సుధీర్ తన గురించి తానే చెప్పుకుంటాడు.

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది