Sudheer Rashmi : రష్మీ కోసం సుధీర్ సాహసం.. ఆమెను ఫిదా చేసేందుకు ఈ సారి ఏకంగా అలా!

 Authored By bkalyan | The Telugu News | Updated on :4 September 2021,3:50 pm

Sudheer Rashmi : సుడిగాలి సుధీర్ రష్మీ జోడిని ఎన్నాళ్ల నుంచి చూస్తున్నా.. ఇంకెన్నాళ్లు చూసినా కూడా బోర్ కొట్టదు. అంతలా ఈ ఇద్దరూ తమ కెమిస్ట్రీతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అయితే వీరిద్దరి మీద ఈవెంట్లు చేసేవారు.. లేదా ఈ ఇద్దరూ ఈవెంట్‌ను నడిపించేవారు. కానీ ఈ మధ్య మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఈవెంట్ చేసిన దాఖలాలు లేవు.

Sudheer Sings Song For Rashmi In Oorilo Vinayakudu

Sudheer Sings Song For Rashmi In Oorilo Vinayakudu

రష్మీ కోసం సుధీర్ సాహసం.. ఆమెను ఫిదా చేసేందుకు ఈ సారి ఏకంగా అలా! Sudheer Rashmi

అయితే ఈ వినాయక చవితికి మాత్రం ఈ జోడి మెప్పించేందుకు వచ్చింది. ఊరిలో వినాయకుడు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌కు రష్మీ సుధీర్ జోడి హైలెట్ అయ్యేలా ఉంది. ఈ ఇద్దరి రొమాన్స్, కెమిస్ట్రీని మరోసారి చూపించబోతోన్నారు. ఇక రష్మీ కోసం ఇది వరకే సుధీర్ ఓ పాట పాడేశాడు. అది మెలోడి. ఎవ్వరు ట్రై చేసినా పాడేయొచ్చు. అడిగా అడిగా అంటూ సుధీర్ పాడిన పాటకు అంతా ఫిదా అయ్యారు.

Sudigali Sudheer Counters on Rashmi Gautam Age

Sudigali Sudheer Counters on Rashmi Gautam Age

కానీ తాజాగా సుధీర్ ఏకంగా ఫాస్ట్ బీట్ అండ్ ర్యాప్‌లా ఉన్న పాటను ఎత్తుకున్నాడు. సింగర్ రేవంత్‌తో పాటు సుధీర్ కూడా పాడేశాడు. రష్మీ మెప్పించేందుకు పెద్ద సాహసమే చేశాడు. రేసుగుర్రం సినిమాలోని స్వీటీ అనే ఈ పాటను సుధీర్ పాడటంతో రష్మీ ఫిదా అయినట్టుంది. దెబ్బకు స్టేజ్ మీదకు వచ్చి.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసేశారు.

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి