Sudigali Sudheer : యువరాజుగా రాణులతో సుడిగాలి సుధీర్ సరసాలు.. ఆకట్టుకుంటున్న అంటే సుందరానికి.. ప్రోమో
Sudigali Sudheer : జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది పాపులర్ అయ్యారు. ఈ ఫేమ్ తోనే సినిమాల్లో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇందులో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జబర్దస్త్ ప్రారంభంలో వేణు వండర్స్ టీమ్ లో కంటెస్టెంట్ గా జర్నీ మొదలుపెట్టిన సుధీర్ తర్వాత టీం లీడర్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ పేరుతో టీం ను ముందుకు నడిపించిన సుధీర్ గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ తో కలసి మంచి స్కిట్ లతో నవ్వించారు. అయితే ఎక్కువగా యాంకర్ రష్మీ తో వచ్చిన పుకార్లతోనే ఫేమస్ అయ్యాడనే చెప్పాలి. వీళ్ల ఇద్దరి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోకి పలు సిజనల్లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక్కడ కూడా రష్మీతో సందడి చేశాడు. అలాగే మరో షో పోవే పోరాతో యాంకర్ విష్ణుప్రియతో కలిసి మెప్పించాడు.
మొత్తానికి బుల్లితెరపై స్టార్ గా వెలిగిపోతున్న సుధీర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా మల్లెమాల సంస్థ నుంచి బయటకు వచ్చి స్టార్ మాలో పలు షోలలో అలరిస్తున్నాడు. స్టార్ మాలో ప్రస్తుతం మరో షో మొదలు కాబోంతోంది. దాని పేరు .. అంటే సుందరానికి.. ఇటీవల రిలీజైన నాని సినిమా పేరునే ఈ ప్రోగ్రాంకి తీసుకున్నారు. ఈ షో ఈ నెల 17 అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇక తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. ఎప్పటిలాగే తన మార్క్ తో ఆకట్టుకున్నాడు. యువరాజు గెటప్ లో అమ్మాయిలతో ఆడిపాడారు. యువరాణీలతో తన స్టైల్ లో మెప్పించాడు. ఇందులో ఎక్స్ ప్రెస్ హరి.. ముక్కు అవినాష్.. రోహిణీ కూడా ఉన్నారు. ఈ ప్రోమోలో అమ్మాయిలతో కలిసి సుధీర్ ఉట్టి కొడుతూ.. బాణాలు ఎక్కుపెట్టి విలు విద్యలు నేర్పిస్తూ కనిపించాడు.

Sudigali Sudheer and his leelas ON Star Maa video
Sudigali Sudheer: యువరాజు గెటప్ లో..
మొత్తానికి చూస్తుంటే ఈ షో కూడా సుధీర్ మ్యాజిక్ తో సూపర్ హిట్ అయ్యేలా ఉంది. కాగా స్టాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మరిన సుధీర్ ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తో కలిసి త్రీ మంకీస్ చేశాడు. అలాగే గాలోడు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వాంటెడ్ పండుగాడు.. పట్టుకుంటే కోటి ట్యాగ్ తో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. ఇందులో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తుండగా సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మిస్తున్నారు.
Meet Mr.Sundar #sudheer and his leela's ON 17th JULY SUNDAY 12pm ANTE SUNDARANIKI! #StarMaa pic.twitter.com/M86JDnKC6C
— Starmaa (@StarMaa) July 14, 2022