Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ భార్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ భార్య

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2025,9:45 pm

ప్రధానాంశాలు:

  •  Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ భార్య

Sudigali Sudheer  : తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి విషయమై ఇటీవల మరోసారి చర్చలు జోరందుకున్నాయి. జబర్దస్త్‌ షోలో తన ప్రతిభతో మెప్పించిన సుధీర్, యాంకర్‌గా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీ షోలు, సినిమాల్లో విజయాలతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించాడు. కానీ 40కి చేరువవుతున్నా పెళ్లిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో, ఆయన్ను పెళ్లి చేసుకోనివారిగా చూసే వారి సంఖ్య పెరుగుతోంది.

Sudigali Sudheer సుడిగాలి సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ భార్య

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ భార్య

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే అంటూ జబర్దస్త్ కమెడియన్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జబర్దస్త్ మాజీ కమెడియన్ ధనరాజ్ భార్య శిరీష ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సుధీర్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ఇంట్లో సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లు తరచూ ఉండేవారని, సుధీర్ తనను ‘వదిన’ అని పిలుచుకునేవాడని ఆమె పేర్కొన్నారు. కష్టసమయంలో మద్దతుగా నిలిచే వ్యక్తిగా ఆయనను గుర్తుచేసుకున్న శిరీష, సుధీర్‌కు పెళ్లంటే ఆసక్తి లేదని, ఒక్కరితోనే జీవితమంతా ఉండటం అతనికి ఇష్టం లేదని చెప్పి ఆశ్చర్యపరిచారు. భవిష్యత్తులో ఆలోచనలు మారొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలతో పాటు, సుధీర్ – రష్మీ గౌతమ్ మధ్య ఉన్న కెమిస్ట్రీపై కూడా చర్చ మొదలైంది. వీరి మధ్య ప్రేమ ఉందా లేదా అనే అనుమానాలు గతంలో నుంచే ఉన్నాయి. కానీ ఇద్దరూ పెళ్లి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గాసిప్స్‌కు పూర్తిగా ముగింపు పడలేదు. అయితే శిరీష చేసిన తాజా వ్యాఖ్యలతో సుధీర్ పెళ్లి చేసే ఆలోచనల్లో లేడన్న విషయం ఓ మోస్తరుగా క్లారిటీకి వచ్చింది. ఈ విషయమై సుధీర్ స్పందిస్తాడా లేదా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది