
will hima reach soundarya family does sourya accept hima
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 14 మార్చి 2022, ఎపిసోడ్ 1299 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంటికి వచ్చి… కాసేపు ఏడ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు చికమగళూరులో లోయలో ఇంద్రుడు అనే వ్యక్తికి హిమ దొరుకుతుంది. దీంతో తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మందులు తీసుకురావడానికి ఇంద్రుడు, చంద్రమ్మ.. ఇద్దరూ కలసి హాస్పిటల్ కు వెళ్తారు. మందులకు వెయ్యి రూపాయలు అవుతాయని డాక్టర్ చెప్పడంతో ఎవరి జేబు కొట్టాలా అని చూస్తుంటాడు ఇంద్రుడు.
will hima reach soundarya family does sourya accept hima
ఇంతలో ఓ వ్యక్తి హాస్పిటల్ లో డబ్బులు లెక్కబెట్టడం చూస్తుంటాడు. అక్కడికి వెళ్లి మాయమాటలు చెప్పి అతడి జేబులో నుంచి వెయ్యి రూపాయలు కొట్టేస్తాడు. హిమకు మందులు తీసుకెళ్తాడు. మరోవైపు హిమకు సంబంధించిన ఏ వస్తువులు ఉండనీయకుండా.. అన్నీ కింద పడేస్తుంది శౌర్య. తన వస్తువులేవీ ఈ ఇంట్లో కనిపించకూడదు అంటుంది శౌర్య. దీంతో హిమ ఏం తప్పు చేసింది అని అడుగుతారు. ఏం చేసిందా చంపేసింది. అమ్మను నాన్నను అదే చంపేసింది అంటుంది శౌర్య.
దీంతో అవును నానమ్మా.. అంటుంది శౌర్య. హిమ మొండిగా తయారైంది అంటుంది. తను కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. హిమ చేసిన పనికి ఈ రోజు నేను అమ్మానాన్న లేని అనాథను అయ్యాను అంటుంది శౌర్య. సౌందర్య చెప్పిన మాటలు కూడా వినదు శౌర్య.
నేను నా కళ్లారా అమ్మానాన్న చనిపోవడం చూశాను అంటుంది శౌర్య. అమ్మను నాన్నను కారులోనే బూడిద చేసేసింది అది అంటుంది శౌర్య. చనిపోయింది అమ్మానాన్న మాత్రమే కాదు.. హిమ కూడా అంటాడు గోవిందరాజు. లేని తన మీద ఇంకా కోపం ఎందుకు అని అంటాడు. దీంతో తను బతికే ఉంది. బతికే ఉంటుంది. తను అంత ఈజీగా చావదు అంటుంది శౌర్య.
తాతయ్య.. మీరు చెప్పేవాళ్లు కదా పాపి చిరాయువు అని.. అదే నానమ్మకం అంటుంది శౌర్య. అది ఎక్కడో బతికే ఉంటుంది అంటుంది శౌర్య. ఇంతలో హిమ కళ్లు తెరుస్తుంది. ప్రమాదం జరగడాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. తనను దీప కిందికి తోసేయడం గుర్తు చేసుకుంటుంది.
అమ్మ.. అమ్మ అంటూ హిమ ఏడుస్తూ ఉండటం చూస్తారు ఇంద్రుడు, చంద్రమ్మ. నువ్వు మాకు లోయలో దొరికావమ్మా అంటారు ఇంద్రుడు. మా అమ్మ ఏది.. మా డాడీ ఏడి.. మా శౌర్య ఏది అని అడుగుతుంది హిమ. కారు ప్రమాదంలో అమ్మానాన్న చనిపోయారని అప్పుడు తెలుసుకుంటుంది హిమ.
అసలు ఏం జరిగిందో మొత్తం ఇంద్రుడుకు చెబుతుంది హిమ. దీంతో హిమను హైదరాబాద్ కు తీసుకొస్తాడు ఇంద్రుడు. సౌందర్య ఇంటికి హిమ వస్తుంది. అప్పుడే శౌర్య.. హాల్ లో ఉన్న హిమ ఫోటోను బయటికి విసిరేస్తుంది. దాని గుర్తులేవీ ఈ ఇంట్లో ఉండకూడదు అంటుంది శౌర్య.
అమ్మానాన్నలను మింగేసింది అది అంటుంది. దీంతో బయట ఉండి అన్నీ వింటుంది హిమ. అది నాకు ఎప్పటికీ ఏమీ కాదు అంటుంది. నేను హిమను వదిలిపెట్టను నానమ్మ. మళ్లీ దాని పేరు ఈ ఇంట్లో ఎవరైనా ఎత్తితే నేను మీకు దక్కను అంటుంది శౌర్య. దీంతో సౌందర్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో వాళ్లను కలవకుండానే హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.