Sudigali Sudheer – Rashmi Gautam : ఢీ కొత్త సీజన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సుధీర్, రష్మీతో చర్చలు జరుగుతున్నాయట!
Sudigali Sudheer – Rashmi Gautam : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో 14వ సీజన్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలేకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ స్టార్ హీరో ఆ గ్రాండ్ ఫినాలే లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు అనే సమాచారం అందుతోంది. ఆ వార్తల కంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వచ్చే సీజన్ కి సుధీర్ మరియు రష్మీ గౌతమ్ మళ్లీ సందడి చేయబోతున్నారు. వీరిద్దరూ దాదాపు మూడు నాలుగు సీజన్లకు టీం లీడర్లుగా వ్యవహరించి మంచి వినోదాన్ని అందించారు.
వీరితో పాటు హైపర్ ఆది కూడా ఉండి వినోదపు జల్లు కురిపించాడు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుడిగాలి సుదీర్ మరియు రష్మి గౌతమ్ లు ఢీ డాన్స్ షో కార్యక్రమం నుండి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. మల్లెమాల వారు వారిద్దరిని తొలగించారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలం లో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా సుడిగాలి సుదీర్ తప్పుకున్నాడు. అయితే బయటికి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ కి ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు.

Sudigali Sudheer and Rashmi Gautam rejoin with dhee dance show
అతడు ఎక్కడ సక్సెస్ అవ్వలేక పోతున్నాడు. అందుకే మళ్ళీ మల్లెమాల వారి తలుపు తట్టాడు అంటూ సమాచారం అందుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో ఛాన్స్ అయితే లేదు కానీ ఢీ డాన్స్ షో లో మాత్రం ఛాన్స్ ఉంది అన్నట్లుగా మల్లెమాల వారి సుడిగాలి సుధీర్ కి చెప్పారని తెలుస్తోంది. రష్మీ మరియు సుడిగాలి సుదీర్ వచ్చేసి సీజన్లో సందడి చేయడం ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్, హైపర్ ఆది, ప్రదీప్.. ఈ నలుగురు ఉంటే ఢీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.