Sudigali Sudheer – Rashmi Gautam : సుధీర్, రష్మీలు మాట్లాడుకోవడం లేదు.. కారణం అదేనట..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 10, 2022, 2:30 pm

Sudigali Sudheer – Rashmi Gautam : జబర్దస్త్‌ స్టార్స్‌ సుధీర్‌.. రష్మీ గౌతమ్ ల యొక్క రొమాన్స్ మరియు వారి యొక్క ప్రేమకు అభిమానులు ఎంతో మంది ఉంటారు. వారిద్దరిని పదే పదే స్క్రీన్ పై చూడాలని కోరుకునే వారు లక్షల్లో ఉంటారు. బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ సుధీర్ కు పేరు దక్కింది. బుల్లి తెర లేడీ స్టార్‌ అంటూ రష్మీ కి పేరు దక్కింది. వీరిద్దరిది కూడా ఒక అద్భుతమైన జర్నీ.. ఇద్దరిది కూడా ఒక అద్భుతమైన బాండింగ్ అనడంలో సందేహం లేదు. ఇంతటి మంచి పేరు దక్కించుకున్న వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. గతంలో సుధీర్ మరియు రష్మీ లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేసే వారు.

కానీ ఇప్పుడు వారి యొక్క జోరు తగ్గిపోయింది. ఈటీవీని వదిలిన సుధీర్‌ పెద్ద తప్పు చేశాడు అంటూ అభిమానులు ఎలా అయితే ఫీల్‌ అవుతున్నారో అలాగే రష్మీ కూడా భావించిందట. సుధీర్ వెళ్లడానికి ముందే రష్మీ ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిందట. అయినా కూడా రష్మీ మాటలు పట్టించుకోకుండా తాను అనుకున్నది చేస్తాను అంటూ సుధీర్ వెళ్లి పోయాడు. ఆ సమయంలోనే రష్మీ మరియు సుధీర్ మధ్య విభేదాలు తలెత్తాయట. సుధీర్ వెళ్లి పోయిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో రష్మీని కలిశాడు. కానీ ఆ సమయంలో ఆమె గతంలో మాదిరిగా పూర్తి స్వేచ్చగా అతడితో మాట్లాడలేదని..

Differences between Rashmi Gautam and Sudigali Sudheer

Differences between Rashmi Gautam and Sudigali Sudheer

ఇద్దరి మధ్య స్నేహం మునుపటి మాదిరిగా కనిపించలేదు అంటూ ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు. ఒకరి అవసరం కోసం మరొకరు వచ్చారు. అంతే తప్ప ఇద్దరు కూడా కావాలని కలిసింది లేదు అంటూ వారి యొక్క సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇద్దరి మధ్య గతంలో కాల్స్ ఉండేవి.. మెసేజ్‌ లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఏమీ ఉండటం లేదట. అసలు ఇద్దరు పరిచయం లేని వారి మాదిరిగానే ఉంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురించాలి.. బుల్లి తెరపై వారిని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది సాధ్యం అయ్యేనా అంటే అనుమానమే అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp