Sudigali Sudheer : ఐ మిస్ యు రష్మి.. ఆమెను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సుడిగాలి సుధీర్ ..!

Authored By aruna | The Telugu News | Published on: September 5, 2023, 4:00 pm

Sudigali Sudheer : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుదీర్ కి ఎటువంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు వెండి తెరపై హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘ గాలోడు ‘ సినిమాతో హీరోగా మంచి సక్సెస్ను అందుకున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరపై కనిపించడం లేదు. ఇకపోతే సుధీర్ రష్మి ల జోడి కి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్కిట్స్, ఈవెంట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరి జంటకి జనాలలో ఆదరణ పెరిగింది.

రీల్ తెరపై ప్రేమికులుగా, దంపతులుగా కనిపించిన సుధీర్ రష్మీ లను రియల్ లైఫ్ కపుల్ గా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అంతలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అయితే చాలా రోజుల నుంచి వీరిద్దరూ కలిసి తెరపై కనిపించడం లేదు. అయితే తాజాగా ఓ టీవీ షోలో కలిసి కనిపించారు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్న నిజమేనే చెబుతున్నా జానే జానా అనే పాటకు సుధీర్ రష్మీ కలిసి డ్యాన్స్ చేసి ఆడియన్స్ను అలరించారు. దీని తర్వాత రష్మి తో తనకున్న అనుబంధం పై ఆసక్తికర కామెంట్లు చేశాడు సుధీర్.

Sudigali sudheer emotional about Rashmi

Sudigali sudheer emotional about Rashmi

రష్మితో నాది బ్యూటిఫుల్ జర్నీ. బేసికల్గా ఆమె చాలా సెన్సిటివ్, హార్డ్ వర్కింగ్ పర్సన్. అందరికంటే ఆమె నాకు ఎక్కువ.మేం బయటికి వెళ్లినా , ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లిన మా జోడి గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా బ్యూటిఫుల్ జర్నీలో సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. జబర్దస్త్ లో నా కామెడీ స్కిట్స్ తో పాటు రష్మీ పాత్ర కూడా చాలా ఉంది. ఆమెతో చేసిన స్కిట్స్, ఈవెంట్స్ , ప్రోగ్రామ్ లు అన్ని సక్సెస్ అయ్యాయి. అందుకు రష్మీకి థాంక్స్ అని చెప్పారు. చివరికి ఐ మిస్ యు రష్మి అని చెప్పడంతో రష్మీ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp