sudigali sudheer remuneration for movies
Sudigali Sudheer : బుల్లి తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసే షో లు ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్. ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా చేస్తున్నా కూడా జనాలు విపరీతంగా ఆధరిస్తున్నారు. సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ అనడంలో సందేహం లేదు. అంతటి హడావుడి మరియు అంతటి హంగామా ఉండే సుధీర్ గురించిన ఒక ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకులను ముఖ్యంగా ఆయన అభిమానులను వేదిస్తుంది.గత కొన్నాళ్లుగా ఢీ ను సూపర్ హిట్.. సూపర్ డూపర్ హిట్..
బంపర్ హిట్ చేసిన సుధీర్ ఈ సీజన్ లో కనిపించడం లేదు. ఆది మాత్రమే ఈ సీజన్ లో ఉన్నాడు. సుడిగాలి సుధీర్ మరియు రష్మి ఇద్దరిని తొలగించారు. సుడిగాలి సుధీర్ లేకుంటే రష్మి ఉన్నా కూడా వృధా ఆ విషయం పక్కన పెట్టేస్తే.. సుడిగాలి సుధీర్ ను ఢీ నుండి తొలగించారా లేదా సుధీర్ స్వయంగా తప్పుకున్నాడా అనేది అభిమానులను వేదిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మల్లెమాల వారు లేదా సుధీర్ చెప్పాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఈ విషయంను చెప్పడం లేదు. ఇటీవల జబర్దస్త్ కామెడీ స్కిట్ లో సుధీర్ మాట్లాడుతూ ఇంకా ఏం మానేయాలిరా ఇప్పటికే ఢీ మానేశాను అన్నాడు.
Sudigali Sudheer fans asking one question about dhee new season
ఆయన మాటలను బట్టి ఢీ ఆయనే మానేశాడనే అభిప్రాయంకు కొందరు వచ్చారు. కాని మల్లె మాల వారు బడ్జెట్ కంట్రోల్ కోసం ఆయన్ను తొలగించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ విషయంలో ఒక క్లారిటీ కోసం ఇప్పుడు అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఒక్క మాట సుడిగాలి సుధీర్ మీడియా ముందుకు వచ్చి లేదా కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా మల్లెమాల వారు నన్ను ఢీ నుండి తొలగించారు.. నాకు ఢీ చేయడం ఇష్టం అంటూ ప్రకటన చేస్తే ఇక ఆయన అభిమానులు ఢీ షో ను ఒక ఆట ఆడేసుకోవడం ఖాయం.
సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ కామెడీ ని ఎంతగా జనాలు ఎంజాయ్ చేస్తారో ఎవరైనా సుధీర్ ను అవమానిస్తే అంతే ధీటుగా ప్రతిస్పందిస్తారు. కామెడీ స్కిట్ లో ఎవరైనా సుధీర్ ను విమర్శిస్తే ఏ స్థాయిలో ఆ కమెడియన్ కు వాయిస్తారో గతంలో మనం చూశాం.. ఇప్పటికి బుల్లెట్ భాస్కర్ ఇతర కంటెస్టెంట్స్ సుధీర్ ను ఏమైనా అనాలంటే కింద బూతులు తిడతారు అంటూ భయపడతారు. అందుకే సుధీర్ ను కనుక మల్లెమాల వారు ఢీ నుండి తొలగించినట్లుగా తేలితే ఖచ్చితంగా అభిమానులు వీరంగం సృష్టిస్తారేమో.
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ…
This website uses cookies.