Home » Exclusive » January 2022 05 Today Omicron Cases In India
Exclusive

Omicron Cases Today : దేశంలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 58 వేల 97 కేసులు..534 మరణాలు.!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 5, 2022, 10:30 am
Advertisement

Omicron Cases Today : భారత్‌ ను ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కలవర పెడుతోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 58 వేల 97 కేసులు నమోదు కాగా.. 534 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 15, 389 మంది మహమ్మారి భారీ నుంచి కోలుకోగా…దేశంలో ప్రస్తుతం 2, 14, 004 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

ఇక డైలీ పాజిటివీటి రేటు 4.18 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు 100కు పైగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ ను దాటింది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది.మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

january 2022 05 Today omicron cases in India

Advertisement

అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి