Sudigali Sudheer : జబర్దస్త్ కి నష్టం లేదు సుడిగాలి సుధీర్ కే కష్టం.. వారి అంచనాలు తల కిందులు
Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై దాదాపుగా పది సంవత్సరాలు కాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతున్న జబర్దస్త్ కామెడీ కార్యక్రమం నుండి ఎంతో మంది కమెడియన్స్ వెళ్లి పోయారు. ధన్ రాజ్ మరియు వేణు నుండి మొదలుకొని మొన్నటి సుడిగాలి సుదీర్ వరకు ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారు.. స్టార్స్ గా మారారు. స్టార్స్ గా జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారు మళ్లీ జీరో స్థాయికి పడిపోయిన వారు కూడా ఉన్నారు. ధనరాజ్ ఈ స్థాయి నుండి ఏ స్థాయికి పడి పోయాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సుడిగాలి సుదీర్ పరిస్థితి కూడా అంతే అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు.
ఈటీవీ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర కార్యక్రమాల్లో చేస్తున్న సమయంలో సుడిగాలి సుదీర్ యొక్క స్టామినా స్టార్ డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేస్తున్నాడు అంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ఆయన షో లు లేక ఖాలాగా ఉండి అటు ఇటు చూసే పరిస్థితి ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆహా ఓటీటీలో ఒక కామెడీ కార్యక్రమం రాబోతుంది. ఆ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ కనిపించబోతున్నాడు. అంతకు మించి టీవీలో ఈయన చేసిన సందడి లేదనే చెప్పాలి. జబర్దస్త్ నుండి సుడిగాలి సుదీర్ వెళ్లిపోయే సమయంలో కచ్చితంగా జబర్దస్త్ కార్యక్రమం ఇక ఎవ్వరు కాపాడలేరు అంటూ చాలా మంది బలంగా వాదించారు. సుడిగాలి సుదీర్ వెళ్లిపోతే జబర్దస్త్ నష్టం తప్పదని రేటింగ్ దారుణంగా పడిపోతుందని అంతా భావించారు.
కానీ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుండి వెళ్లి పోవడం ద్వారా జబర్దస్త్ కి నష్టం జరగలేదు. కానీ సుడిగాలి సుదీర్ కే నష్టం జరిగింది అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెలలో 20 రోజులు బిజీ బిజీగా ఈటీవీలో ఉన్నప్పుడు షూటింగ్ లతో గడిపిన సుడిగాలి సుదీర్.. ఇప్పుడు మాత్రం నెలలో కనీసం వారం పది రోజులు కూడా షూటింగ్ లేక వేల వేల పోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హీరోగా ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.. అయినా కూడా ఆయన నుండి టీవీ కార్యక్రమాలు రాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనవసరంగా స్టార్ మా కి వెళ్ళారంటూ సుడిగాలి సుదీర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుదీర్ ఆ విషయమై చింతిస్తూ ఉంటాడని బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.